హమాస్ దాడుల్లో భారత్ పేరు లాగిన జో బైడెన్ ! సంచలన ఆరోపణలు..

ఇజ్రాయెల్ హమాస్ మధ్య దాడులు, ప్రతిదాడులతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. ముఖ్యంగా హమాస్ దాడుల తర్వాత గాజాపై వైమానిక దాడులు చేసిన ఇజ్రాయెల్ ఇప్పుడు భూమార్గంలోనూ దాడులు చేస్తోంది. దీంతో ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే ఇజ్రాయెల్ కు పాశ్చాత్య దేశాలు మద్దతు పలుకుతుండగా.. హమాస్ కు అరబ్ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారత్ ను ఈ వివాదంలోకి లాగారు.

ఇజ్రాయెల్‌పై హమాస్ ఉగ్రవాద దాడి వెనుక తాజాగా ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు సందర్భంగా ప్రకటించిన ఓ ప్రతిష్టాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన ఆరోపణలు చేశారు. భారత్-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఎకనామిక్ కారిడార్ (IMEEC).. ఈ ఏడాది ప్రారంభంలో ప్రారంభించబారు. ఇది మొత్తం ప్రాంతాన్ని విస్తృతమైన రైల్‌రోడ్ నెట్‌వర్క్ ద్వారా కనెక్ట్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

US president joe biden has revealed the reason for hamas attacks on israel and he said that middle east corridor between india and europe behind this.

ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ హమాస్ ఈ దాడులకు పాల్పడినట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లో సందర్శించిన ఆస్ట్రేలియన్ ప్రధాన మంత్రి ఆంథోనీ అల్బనీస్‌తో కలిసి మీడియాతో మాట్లాడిన బైడెన్.. "హమాస్ దాడి వెనుక ఈ కారిడార్ కారణమిని తాను నమ్ముతున్నానని, అయితే దీనికి తన దగ్గర ఆధారాలు లేవన్నారు. అయితే ఇజ్రాయెల్ కోసం ప్రాంతీయ సమైక్యత దిశగా చేపడుతున్న పనుల్ని ఆపేసే ఉద్దేశం లేదన్నారు.

సెప్టెంబర్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో చైనా యొక్క బెల్ట్, రోడ్ ఇనిషియేటివ్‌కు ప్రత్యామ్నాయంగా భావించే IMEEC ప్రాజెక్టును అమెరికా, భారత్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ , యూరోపియన్ యూనియన్ నాయకులు సంయుక్తంగా ప్రకటించారు. ఈ కారిడార్‌లో భారతదేశాన్ని గల్ఫ్ ప్రాంతానికి అనుసంధానించే తూర్పు కారిడార్, గల్ఫ్ ప్రాంతాన్ని యూరప్‌కు అనుసంధానించే ఉత్తర కారిడార్ ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+