Exclusive: యూఎస్ లో కొత్త ట్రాప్ లో చిక్కుకున్న భారతీయ నిరుద్యోగులు.. పేరెంట్స్ పారాహుషార్!

యూఎస్ లో చదువుకుని ఉద్యోగాల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న యువత ఉద్యోగాలు రాక, సంపాదన కోసం ఏం చేస్తున్నారు? మనదేశంలో చట్ట విరుద్ధం అయిన, యూఎస్ లో చట్ట బద్ధమైన బెట్టింగ్ యాప్ లలో తమ లక్ పరీక్షించుకుంటున్నారు. డబ్బు సంపాదనకు బెట్టింగ్ యాప్ లు, లాటరీల బాట పట్టి వాటికి అడిక్ట్ అవుతున్నారు.

బెట్టింగ్ యాప్ లలో, లాటరీలలో అదృష్టం ఎవరో కొందరిని వరిస్తే, చాలామంది ఉన్నది పోగొట్టుకుంటున్నారు. భవిష్యత్ ను నాశనం చేసుకుంటున్నారు. తీవ్ర డిప్రెషన్ బారిన పడుతున్నారు. యూఎస్ లో భారతీయ యువతకు ఇప్పుడు కాల్షి యాప్ వ్యసనంగా తయారైంది. అసలు ఏమిటీ కాల్షి యాప్.. ఇందులో ఏం జరుగుతుంది? డబ్బు ఎలా సంపాదిస్తారు? దీని ప్రభావం ఆయా వ్యక్తుల జీవితంపై ఎలా ఉంటుంది అనేది వన్ ఇండియా ఎక్స్ క్లూజివ్ కథనంలో

Kalshi App Addiction How Kalshi Became a Trap for Indian Students who are jobless in America

కాల్షి యాప్ అనేది ఒక ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్. యూఎస్ లో ఎక్కువ ప్రాచుర్యం పొందిన ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ ఫారమ్. ఇది సాధారణం అయిన బెట్టింగ్ యాప్ కాదు. ఇందులో దేని మీద అయినా బెట్టింగ్ ఆడొచ్చు. ఉదాహరణకు ట్రంప్ ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్ లో ట్రంప్ 4 సార్లు చైనా అన్న పదం వాడతారు అన్న టాపిక్ మీద కూడా బెట్టింగ్ కట్టొచ్చు.

ఇందులో ఎస్ ఆర్ నో అన్నదే బెట్టింగ్. ఇది రియల్ వరల్డ్ ఈవెంట్స్ పై ఎస్ లేదా నో అనే కాంట్రాక్ట్ లను ట్రేడ్ చేసే యాప్. ఇది కమోడిటీ ఫ్యూచర్స్ ట్రేడింగ్ కమిషన్ నియంత్రణలో పని చేస్తుంది. ఇది యూఎస్ లో చట్టబద్ధమైన యాప్. స్పోర్ట్స్, పాలిటిక్స్, ఎకనామిక్స్, వార్, క్రిప్టో, క్లైమేట్, కల్చర్ ఇలా ఏ టాపిక్ మీద అయినా ప్రిడిక్షన్ బెట్టింగ్ కట్టొచ్చు.

ఉద్యోగాలు లేక, రాక ఇబ్బంది పడుతున్న భారతీయ నిరుద్యోగులు ఈ యాప్ లో ప్రిడిక్షన్ బెట్టింగ్స్ కడుతున్నారు. దీని ద్వారా డబ్బులు సంపాదిస్తున్న వారు తమకు తెలీకుండానే ఈ అడిక్షన్ కు గురవుతున్నారు. యూఎస్ లో తాజా పరిస్థితులపై వన్ ఇండియా తెలుగుతో మాట్లాడిన కాలిఫోర్నియా, వర్జీనియా, కాన్సాస్, న్యూయార్క్ లలో ఉంటున్న స్టూడెంట్స్ కమ్యూనిటీకి చెందిన సాయి మధుహాస్, చందన, మేఘన, నిఖిల్, గౌతమ్ తదితరులు ఈ విషయాన్ని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు.

గ్రీన్ ఎనర్జీకి బిగ్ బూస్ట్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం-ధార పథకం!
గ్రీన్ ఎనర్జీకి బిగ్ బూస్ట్.. రూ.1.86 లక్షల కోట్లతో పీఎం-ధార పథకం!

ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు, వీసాలు, ఉద్యోగాల విషయంలో పెడుతున్న రిస్ట్రిక్షన్స్ వెరసి డబ్బు సంపాదనకు విద్యార్థులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుకుతున్నారు. అందులో భాగంగా కాల్షి వంటి ప్రిడిక్షన్ బెట్టింగ్ యాప్స్ కు బానిసలవుతున్నారు. బాగా చదువుకున్న భారతీయ యువత ఉద్యోగాలు రాక ఇలాంటి యాప్స్ కు అలవాటు పడితే వాళ్ళ భవిష్యత్ వాళ్ళే చేజేతులా నాశనం చేసుకున్నట్టు అవుతుంది. ఇది తీవ్రతరం కాకముందే పేరెంట్స్ పారాహుషార్!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+