రగిలిపోతున్న కమలా హ్యారిస్-వారసురాలు ఉషకు అవమానం..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్ధిగా పోటీ చేసి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డినా ఓటమి పాలైనా కమలా హ్యారిస్ రగిలిపోతున్నారు. ఎన్నికల్లో ఇంత చేసినా తాను ఓడిపోవడం, తన బద్ధ శత్రువైన ట్రంప్ అధ్యక్షుడు కాబోతుండటం, అదే సమయంలో తోటి భారతీయురాలు ఉషా బాల భర్త జేడీ వాన్స్ ఉపాధ్యక్షుడు కాబోతుండటం కమలకు అస్సలు రుచించడం లేదని తెలుస్తోంది. దీంతో కమలా హ్యారిస్ తన హోదా మర్చిపోయి చీప్ గా వ్యవహరిస్తున్నారు.

అమెరికాలో అధ్యక్షులు, ఉపాధ్యక్షులుగా పనిచేసి పదవీ విరమణ చేసిన తర్వాత కొత్తగా తమ పదవిలోకి రాబోయే వారికి తాము అప్పటి వరకూ నివసించిన ఇళ్లలోకి సాదరంగా ఆహ్వానించి రెసిడెన్స్ టూర్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే తాజాగా ఉపాధ్యక్ష పదవి నుంచి తప్పుకోబోతున్న కమలా హ్యారిస్ మాత్రం ఇలా కాబోయే ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ దంపతుల్ని రెసిడెన్స్ టూర్ కు వచ్చేందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది.

kamala harris insults successor Usha Vance Denied traditional Residence Tour

అమెరికా సెనేటర్ అయిన జేడీ వాన్స్, ఆయన భార్య ఉష, వారి ముగ్గురు పిల్లలు జనవరి 20 తొలిసారి నావల్ అబ్జర్వేటరీ నివాసంలోకి మారనున్నారు. ఈ లోపు కమలా హ్యారిస్ సిబ్బందితో వారు కనెక్ట్ అయి ఈ ప్రక్రియ సాఫీగా సాగిపోవడానికి సహకరించాల్సి ఉంది. అయితే కమల మాత్రం వీరికి సహకరించకుండా చుక్కలు చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఇప్పుడు రిపబ్లికన్లతో పాటు డెమోక్రాట్లలోనూ చర్చనీయాంశమైంది. ఉషకు ఇవాన్, వివేక్, మిరాబెల్ వాన్స్ అనే ఎనిమిదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వీరితో కలిసి సాఫీగా కొత్త ఇంట్లోకి వెళ్లేందుకు తోటి భారతీయురాలు కమలా హ్యారిస్ అడ్డంకులు కల్పించడం చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+