వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరిత్ర తిరగరాసిన కమలా హ్యారిస్: అమెరికా ఉపాధ్యక్షురాలిగా డిక్లేర్: చెన్నై టు అమెరికా

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ చరిత్రను తిరగ రాశారు. ఏ మహిళకూ సాధ్యం కాని రికార్డును నెలకొల్పారు. అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. అత్యున్నతమైన ఈ పదవికి ఎన్నికైన తొలి భారతీయ సంతతికి చెందిన మహిళ ఆమే. అంతేకాదు- ఆసియన్-అమెరికన్ మహిళ కూడా కమలా హ్యారిసే. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా మూడురోజుల పాటు కొనసాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను కొద్దిసేపటి కిందటే ప్రకటించారు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్.. ఎన్నికయ్యారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఆయన ఓడించారు. ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ విజయం సాధించినట్లు వెల్లడించారు.

2024 అధ్యక్ష పదవి రేసులో..

2024 అధ్యక్ష పదవి రేసులో..

అమెరికా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయురాలైన మహిళగా కమలా హ్యారిస్ చరిత్ర సృష్టించారు. 55 సంవత్సరాల కమలా హ్యారిస్ ఇప్పటికే ప్రతిష్ఠాత్మక కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు ఎంపిక అయ్యారు. యూఎస్ సెనెట్‌కు ఎంపికైన తొలి ఇండియన్ అమెరికన్‌గా రికార్డు సృష్టించారు. అలాగే సెనెట్‌కు ఎంపికైన రెండో ఆఫ్రికన్ అమెరికన్‌గా కమలా హ్యారిస్ గుర్తింపు పొందారు. ఈ గెలుపుతో 2024లో నిర్వహించబోయే అమెరికా అధ్యక్ష పదవికి ఆటోమేటిక్‌గా నామినేట్ అవుతారు.

 చెన్నై నుంచి అమెరికాకు

చెన్నై నుంచి అమెరికాకు

కమలా హ్యారిస్ మూలాలు తమిళనాడులో ఉన్నాయి. ఆమె తల్లి శ్యామలా గోపాలన్ స్వస్థలం చెన్నై. వివాహానికి ముందే ఆమె అమెరికా వెళ్లిపోయారు. కాలిఫోర్నియాలోని ఓక్లాండోలో స్థిరపడ్డారు. వృత్తిపరంగా డాక్టర్. జమైకాకు చెందిన హ్యారిస్‌ను ఆమె పెళ్లి చేసుకున్నారు. 1964 అక్టోబర్ 20వ తేదీన కమలా హ్యారిస్ జన్మించారు. ఆమె న్యాయవాదిగా స్థిరపడ్డారు. 2003లో శాన్‌ఫ్రాన్సిస్కో జిల్లా అటార్నీగా విజయం సాధించారు. 2016లో నిర్వహించిన అమెరికా ఎన్నికల్లో కాలిఫోర్నియా నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మొట్టమొదటి ప్రయత్నంలోనే ఆమె సెనెట్‌కు ఎంపిక అయ్యారు. ఈ సారి ఏకంగా ఉపాధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.

ఫలించిన వ్యూహం..

ఫలించిన వ్యూహం..

భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్‌ను ఉపాధ్యక్ష పదవి కోసం ఎంపిక చేయడంలో డెమొక్రాట్లు వ్యూహాత్మకంగా వ్యవహరించారనేది స్పష్టమైంది. అమెరికా వ్యాప్తంగా లక్షల సంఖ్యలో స్థిరపడిన ప్రవాస భారతీయలను ఆకట్టుకోవడంలో భాగంగా.. కమలా హ్యారిస్ పేరును ఖరారు చేశారు. ఆ వ్యూహం ఫలించింది. అమెరికా రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్‌గా గుర్తింపు ఉన్న ఆమె ఆ దేశ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు.

తాత భారత రాయబారి..

తాత భారత రాయబారి..

కమలా హ్యారిస్‌ది ఉన్నత వర్గానికి చెందిన కుటుంబం. ఆమె తాత పీవీ గోపాలన్.. భారత రాయబారిగా పనిచేశారు. పలు దేశాల్లో ఆయన విధులను నిర్వర్తించారు. కమలా హ్యారిస్ తల్లి డాక్టర్ శ్యామలా గోపాలన్ 60 సంవత్సరాల కిందటే ఉన్నత విద్యను అభ్యసించడానికి ఒంటరిగా అమెరికాకు తరలి వెళ్లారు. కాలిఫోర్నియాలో చదువుకున్నారు. యూసీ బర్కెలిలో చదువుకున్నారు. అక్కడే డాక్టరేట్ పొందారు. బ్రెస్ట్ కేన్సర్ స్పెషలిస్ట్‌గా, పరిశోధకురాలిగా పేరు తెచ్చుకున్నారు. అదే సమయంలో జమైకాకు చెందిన డొనాల్డ్ హ్యారిస్‌ను ఆమె పెళ్లాడారు. డొనాల్డ్ హ్యారిస్.. జమైకాకు చెందిన ఎకనమిస్ట్.

 మాయా హ్యారిస్ కెనడాలో

మాయా హ్యారిస్ కెనడాలో

కెనడాలో కమలా హ్యారిస్ సోదరి.. శ్యామలా హ్యారిస్‌కు ఇద్దరు కుమార్తెలు కాగా.. మరొకరు కెనడాలో స్థిరపడ్డారు. ఆమె పేరు మాయా హ్యారిస్. ఇద్దరూ స్నేహితుల్లా కలిసి మెలిసి ఉంటారని సరళా గోపాలన్ తెలిపారు. 1962లో మాయా హ్యారిస్ స్టాన్‌ఫర్డ్ లా స్కూల్‌లో చదువుకున్నారు. కార్పొరేట్ లాలో నిష్ణాతురాలిగా పేరు తెచ్చుకున్నారు. 29 ఏళ్ల వయస్సులోనే ఆమె లింకన్ లా స్కూల్ డీన్‌గా నియమితులు అయ్యారు. అమెరికాలో అతి చిన్న వయస్సులోనే న్యాయ కళాశాల డీన్‌గా నియమితులు కావడం అదే తొలిసారి. కమలా హ్యారిస్ కూడా న్యాయవాద వృత్తినే చేపట్టారు.

English summary
Kamala Harris has made history as the first woman, the first Black American and the first Asian American Vice President of America. With Joe Biden, 77, winning a thriller of an election, much of the spotlight is on his running mate.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X