వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరాచీ యూనివర్సిటీ పేలుడు: ఆత్మాహుతి దాడిలో ముగ్గురు చైనీయులతోపాటు నలుగురు మృతి

|
Google Oneindia TeluguNews

ఇస్లామాబాద్: చైనా దేశీయులే లక్ష్యంగా పాకిస్థాన్‌లోని కరాచీ యూనివర్సిటీ పరిధిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు చైనీయులు ఉండటం గమనార్హం. చైనీయులే లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిగా అధికారులు భావిస్తున్నారు.

కరాచీ యూనివర్సిటీలోని చైనా నిర్మించిన కన్పుసీయస్ ఇనిస్టిట్యూట్ వద్ద ఈ పేలుడు జరిగింది. స్థానికులకు చైనీస్ నేర్పించడం కోసం చైనా ఇది వరకు ఈ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేసింది. మృతుల్లో ఇనిస్టిట్యూట్ డైరెక్టర్ హువాంగ్ రిపింగ్, డింగ్ ముపెంగ్, చెన్ సా, ఖలీద్ ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ పేలుడు ఘటనలో వాంగ్ యుగింక్, హమీద్ అనే మరో ఇద్దరు గాయపడ్డారని చెప్పారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందన్నారు.

Karachi University Blast: Three Chinese Nationals Among 4 Dead, BLA Claims Responsibility

ఇదివరకు ఈ తరహా దాడులు బలూచిస్థాన్‌కు చెందిన మిలిటెంట్లు చైనీయులే లక్ష్యంగా జరిపారని అధికారులు తెలిపారు. ఈ దాడికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు సమగ్ర విచారణ జరుపుతున్నామని అధికారులు వెల్లడించారు.

కాగా, ఓ మహిళ ఆత్మాహుతి దాడికి పాల్పడటంతోనే ఈ పేలుడు సంభవించినట్లు సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు చెబుతున్నాయి. ప్రత్యక్ష సాక్షులు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. 'వాహనంపై బాల్ బేరింగ్‌ల స్పష్టమైన గుర్తులు కనిపిస్తాయి, ఇది ఉగ్రదాడి అని నిర్ధారిస్తుంది. వ్యాన్ ఒక వైపు మరింత దెబ్బతిన్నట్లు కూడా చూడవచ్చు, ఇది ఆత్మహత్యతో దాడి చేసి ఉండవచ్చని సూచిస్తుంది. ఒకవైపు వాహనం దగ్గరకు వచ్చిన తర్వాత పేలుడు సంభవించింది' అని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

ఈ దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) ప్రకటించడం గమనార్హం. షరీ అలియాస్ బర్మాష్ అనే మహిళ చైనీయులే లక్ష్యంగా ఈ దాడికి పాల్పడిందని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ మజీద్ బ్రిగేడ్ ప్రకటించారు.

English summary
Karachi University Blast: Three Chinese Nationals Among 4 Dead, BLA Claims Responsibility.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X