వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికన్ ఎన్నికల కోసం.. పాప్ సింగర్ న్యూడ్ పబ్లిసిటీ (వీడియో)

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్ : అమెరికన్ అధ్యక్ష ఎన్నికల పుణ్యమాని ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతున్నట్టే కనిపిస్తోంది. అయితే ఓటర్లను ఆకర్షించడం కోసం ఇదేదో నేతలు చేస్తోన్న హంగామా కాదు. తమ అభిమాన నేతకు పట్టం కట్టేందుకు నేతల అభిమానులే రంగంలోకి దిగి వినూత్న ప్రచారంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.

నిన్నటికి నిన్న.. "బిచ్చం వేస్తారా..! లేక ట్రంప్ కు ఓటేయమంటారా..?" లాంటి ప్రచారం అమెరికన్ సోషల్ మీడియాలో దర్శనమివ్వగా.. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి హిల్లరీకి మద్దతు తెలుపుతోన్న ప్రముఖ పాప్ సింగర్ కాటీ పెర్రీ న్యూడ్ పబ్లిసిటీ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల్లో ఎక్కువ మంది యువతను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశ్యంతో.. ఫన్నీ ఆర్ డై అండ్ రాక్ ది ఓట్ పేరిట ఓ వీడియోను రూపొందించింది కెర్రీ.

వీడియో ప్రారంభమవగానే కెర్రీ సహా కొంతమంది వ్యక్తులు నిద్రలోంచి అప్పుడే మేల్కోవడం కనిపిస్తుంది. అప్పటికే నిద్రలేచిన మరికొంతమంది అదే గెటప్ లో ఓటు వేయడం కోసం క్యూలో నిలబడి ఉంటారు. ఇదే విషయం గురించి చెబుతూ.. ప్రజాస్వామ్య దేశంలో నిద్రలోంచి ఎవరూ లేచి వచ్చినా అభ్యంతరకరం కాదంటూ వీడియో ద్వారా తన సందేశాన్ని చెప్పింది కెర్రీ. అయితే ఇదే వీడియోలో.. నిద్రలోంచి లేచిన గెటప్ లోనే పోలింగ్ బూత్ కు వెళ్లే కెర్రీ.. తన ఒంటిమీదున్న దుస్తులను ఒక్కసారిగా చించేసుకుంటుంది.

కెర్రీ న్యూడ్ గెటప్ లో దర్శనమివ్వగానే.. అక్కడికి ఓ ఆడ మగ పోలీసులు ఇద్దరు ఎంటరవుతారు. అయితే ఆ ఇద్దరు పోలీసులతో 'నగ్నంగా ఓటు వేసే హక్కుంది' అంటూ వాదిస్తుంది కెర్రీ. అక్కడితో కెర్రీ మాటలకు ఫుల్ స్టాప్ పెట్టించి తమ కారులో అక్కడినుంచి కెర్రీని అక్కడినుంచి తరలిస్తారు పోలీసులు.

English summary
made a bold statement on Instagram Monday: "TOMORROW, I USE MY BODY AS CLICK BAIT TO HELP CHANGE THE WORLD." The pop star followed through, as she teamed up with Funny or Die and Rock the Vote on Voter Registration Day to get people to the polls Nov. 8. Perry wants people—especially young people—to get involved in the political process.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X