వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్యాస్ ధరల పెంపు: దేశ వ్యాప్త భారీ నిరసనలతో గద్దెదిగిన కజకిస్థాన్ ప్రభుత్వం

|
Google Oneindia TeluguNews

నూర్ సుల్తాన్: మనదేశంలో ఉల్లి ధరలు రాష్ట్ర ప్రభుత్వాలను గద్దె దించగా.. కజకిస్థాన్ ప్రభుత్వాన్ని పడగొట్టింది గ్యాస్ ధరల పెరుగుదల. గ్యాస్ ధరల పెంపుపై మధ్య ఆసియా దేశాన్ని చుట్టుముట్టిన భారీ నిరసనల మధ్య కజకిస్థాన్ ప్రభుత్వం తన రాజీనామాను ప్రకటించింది.

అధ్యక్ష డిక్రీ ప్రకారం అస్కర్ మామిన్ ప్రభుత్వం చేసిన రాజీనామాను కజకిస్థాన్ అధ్యక్షుడు ఖాసిమ్ జోమార్ట్ టోకయేవ్ బుధవారం ఆమోదించారు.

 Kazakhstan government resigns amid mass protests over gas price hike

'రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 70 ప్రకారం.. రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ ప్రభుత్వం రాజీనామాను ఆమోదించాలని నేను నిర్ణయించుకున్నాను' అని అధ్యక్ష డిక్రీ పేర్కొంది.

అంతకుముందు, ప్రాంతీయ ఇంధన ధరల పెంపుపై ప్రారంభమైన భారీ నిరసనలు విస్తారమైన మాజీ-సోవియట్ దేశంలోని ఇతర ప్రాంతాలను చుట్టుముట్టడంతో టోకాయేవ్ అతిపెద్ద నగరం అల్మాటీ, చమురు సంపన్నమైన పశ్చిమ ప్రాంతంలో అత్యవసర పరిస్థితులను విధించారు.

లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ (LPG) స్థానిక ధరల పెరుగుదలపై దేశంలోని పశ్చిమ ప్రాంతంలో ప్రారంభమైన అశాంతిని అణిచివేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్, స్టన్ గ్రెనేడ్‌లను ప్రయోగించడంతో కజకిస్థాన్ ఆర్థిక రాజధాని ఆగ్నేయ నగరం అల్మాటీ మంగళవారం అర్థరాత్రి నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

మామిన్ ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత, స్మైలోవ్ అలీఖాన్ అస్ఖానోవిచ్ దేశ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఉంటారని టోకయేవ్ చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ప్రస్తుత ప్రభుత్వ సభ్యులు తమ ఉద్యోగాలను పూర్తి చేస్తూనే ఉంటారని డిక్రీ స్పష్టం చేసింది.

హింసాత్మక నిరసనలకు దారితీసిన ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ ధరల పెంపును ఉపసంహరించుకున్న తర్వాత ఇంధనం, ఇతర "సామాజికంగా ముఖ్యమైన" వస్తువుల ధరలను నియంత్రించాలని టోకాయేవ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని ఆదేశించారు.

గ్యాస్ ధరల నిరసనలతో ప్రభుత్వం దిగిపోవడంతో.. చమురు సంపన్న దేశ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం మంగిస్టౌలో లీటరుకు 50 టెంజ్ ($0.11) లేదా మార్కెట్ ధరలో సగం కంటే తక్కువ ధరను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించింది.

ధరల పరిమితి కారణంగా కజకిస్తాన్‌లో వాహన ఇంధనంగా గ్యాసోలిన్ కంటే చాలా చౌకగా ఉడటంతో చాలా మంది కజఖ్‌లు తమ కార్లను LPGతో నడిచేలా మార్చారు. కానీ ప్రభుత్వం తక్కువ ధర భరించలేనిదిగా వాదించింది, జనవరి 1న పరిమితులను ఎత్తివేసింది.

ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. వేలాది మంది రోడ్లను దిగ్భంధం చేశారు. దీంతో పోలీసులు అణిచివేసేందుకు ప్రయత్నించినప్పటికీ నిరసనకారులు వెనక్కి తగ్గలేదు. రోజు రోజుకు నిరసనలు ప్రధాన నగరాల్లో పెరిగిపోతుండటంతో ప్రభుత్వం దిగిపోక తప్పలేదు.

English summary
Kazakhstan government resigns amid mass protests over gas price hike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X