Canada: టొరంటోలో ఖలిస్తాన్ మద్దతుదారుల ఆందోళన..
కెనడాలోని ఖలిస్తాన్ మద్దతుదారులు సోమవారం భారత దౌత్య మిషన్ వెలుపల నిరసన ప్రదర్శనలు చేశారు. ఖలిస్తానీ నాయకుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు నిరసనగా వంద మందికి పైగా ఖలిస్తాన్ మద్దతుదారులు ఆందోళనలో పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టొరంటోలో సుమారు 100 మంది నిరసనకారులు ప్రతీకాత్మకంగా భారతీయ జెండాను తగులబెట్టారు. వాంకోవర్ కాన్సులేట్ వెలుపల దాదాపు 200 మంది ప్రదర్శనకారులు సమావేశమయ్యారు. ఒట్టావాలో, భారతీయ హైకమిషనర్ కార్యాలయం ముందు 100 కంటే తక్కువ మంది వ్యక్తులు గుమిగూడి, "ఖలిస్తాన్" అనే పదాన్ని కలిగి ఉన్న పసుపు జెండాలను ప్రదర్శించారు.
ఒట్టావాలోని ఒక నిరసనకారుడు రేష్మా సింగ్ బోలినాస్ జస్టిన్ ట్రూడోకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ హేయమైన చర్య వెనుక ఉన్న నిజాన్ని వెలికితీసేందుకు, భవిష్యత్తులో అమాయకుల హత్యను నిరోధించడానికి భారతదేశంపై ఒత్తిడి తీసుకురావడానికి కెనడా ఎటువంటి ఆధారాన్ని వదిలిపెట్టవద్దని కోరారు. జూన్‌లో 45 ఏళ్ల నిజ్జర్‌ను హత్య చేశారు. ఈ హత్య వెనక భారత ఏజెంట్లు ఉన్నారని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో అనుమానం వ్యక్తం చేశారు. అయితే దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. ట్రూడో వ్యాఖ్యలను ఖండించింది.

భారత్ కెనడాలోని తమ పౌరలకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. అటు కెనడా కూడా భారత్ లో పర్యటించే కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కోరింది. మరోవైపు అగ్రరాజ్యం అమెరికా భారత్ కెనడాకు సహరించాలని సూచించింది. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలపై కెనడా రక్షణ మంత్రి బిల్ బ్లెయిర్ మాట్లాడారు. ఇండియాతో తమకు బంధం చాలా ముఖ్యమని చెప్పారు. నిజ్జర్ హత్యకు సంబంధించి తమకు కచ్చితమైన సమాచారం ఉందని ఆయన్ తేల్చి చెప్పారు.
కెనడా అధికారుల దర్యాప్తుకు భారత్ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం కెనడాలో సుమారు 7,70,000 మంది సిక్కులు నివసిస్తున్నారు. ఇది పంజాబ్ వెలుపల అతిపెద్ద సిక్కు జనాభా గల దేశంగా ఉంది. వారి ఓట్లు పొందడానికి ట్రూడో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని కొందరు వాదిస్తున్నారు. 50 ఏళ్ల క్రితం పంజాబ్ నుంచి వలస వెళ్లి కెనడియన్ పౌరసత్వం పొందిన నిజ్జర్ అనే ప్లంబర్ ఖలిస్తాన్ తరపున న్యాయవాదిగా ఉన్నారు. జూలై 2020లో భారతదేశం అతన్ని "ఉగ్రవాదిగా" గుర్తించింది.












Click it and Unblock the Notifications