Kim Jong Un:కిమ్ మామకు కోపం వచ్చింది..ఒలింపిక్స్ పతక విజేతలపై..!!
అది అద్గదీ...ఏంటబ్బా కిమ్ మామ గురించి ఇంకా పేలిపోయే వార్త రాలేదు అని అనుకుంటున్నారా..? ఆ వార్త రానే వచ్చింది. సాధారణంగా ఉత్తర కొరియా నియంతకు కోపం వస్తే అవతల వాళ్లు ఎవరైనా సరే మాడి మసి కావాల్సిందే. ప్రపంచాన్నే గడగడ లాడించే కిమ్ మామ కొన్ని రోజులుగా కాస్త సైలెంట్‌గా ఉన్నారు. అంతా బాగుందనుకుంటున్న సమయంలో పారిస్ ఒలింపిక్స్ కిమ్ జాంగ్ ఉన్‌కు కోపం తెప్పించింది. అంటే ఒలింపిక్స్ మీద కోపం కాదనుకోండి. ఒలింపిక్స్ వేదికగా జరిగిన ఒక సన్నివేశం కిమ్ కోపానికి కారణమైంది. ఇంతకీ ఏంటా మ్యాటర్ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.
పొట్టివాడు కాదమ్మో..గట్టివాడమ్మో.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్.. పరిచయం అక్కర్లేని పేరు. ఎంతటి నియంతో ప్రపంచం మొత్తానికి తెలుసు. అగ్రరాజ్యం అమెరికాకే ముచ్చెమటలు పట్టించాడంటే ఈ పొట్టోడు ఎంతటి గట్టోడో అర్థమవుతోంది. తన దేశం జోలికి వచ్చినా.. తనను టార్గెట్ చేయాలన్న ఆలోచన వచ్చే లోపే విధ్వంసం సృష్టించగల వ్యక్తి కిమ్ జాంగ్ ఉన్. తనకు తెలియకుండా తన దేశంలోకి ఒక చీమ కూడా ప్రవేశించదు.. అలానే తన దేశం దాటి ఇంకో చీమ బయటకు వెళ్లదు. ఒకవేళ అది జరిగిందా... ఇక వారికి పుట్టగతులుండవు. ఏ దేశంలో దాక్కున్నా వేటాడి చంపేస్తాడు. అది ఆయన మనస్తత్వం. ఇంతకీ ఈ రామాయణం అంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. కిమ్‌కు మరోసారి కోపం వచ్చింది. ఈ సారి బలికాబోతున్నది ఎవరో తెలుసా..? మరెవరో కాదు పారిస్ ఒలింపిక్స్‌లో తన దేశ పతాకాన్ని సగర్వంగా ఎగిరేసిన క్రీడాకారులే.

కిమ్ కంట పడ్డ క్రీడాకారులు
ఉత్తర కొరియా దేశం గర్వపడేలా చేసిన ఆ క్రీడాకారులపై కిమ్ మామకు కోపం ఎందుకనేగా మీ డౌటు... అక్కడికే వస్తున్నా. ఈ మధ్యే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో ఈ చిచ్చు ప్రారంభమైంది. ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన టేబుల్ టెన్నిస్ గేమ్‌లో ఉత్తర కొరియా ప్లేయర్లు కిమ్ కుమ్ యాంగ్, రి జాంగ్ సిక్‌లు వెండి పతకం సాధించారు. ఇంత వరకు బాగానే ఉంది. అక్కడితో ఆగకుండా ఆ ఆనందాన్ని కాంస్య పతక విజేతలు, దక్షిణకొరియా ఆటగాళ్లు అయిన లిమ్ జాంగ్ హూన్, షిన్ యూ బిన్‌లతో సెల్ఫీ దిగారు. ఇదే ఉత్తర కొరియా ఆటగాళ్ల కొంప ముంచింది. ఈ సెల్ఫీ తెగ వైరల్ కావడంతో కిమ్ మామ కంట పడింది. ఇంకేముంది భస్మమే.
The North 🇰🇵and South Korean🇰🇷athletes in one selfie 🤳suggested by 🇨🇳Chinese gold medal winner Sun Yingsha.
— China in Pictures (@tongbingxue) July 31, 2024
A warmhearted group photo!#Paris2024 #OlympicGames #TableTennis pic.twitter.com/utCEL5S6KH
ఆ సెల్ఫీ సంచలనమే..కానీ..
అసలే ఉత్తరకొరియా దక్షిణ కొరియా దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. కానీ ఇప్పుడు ఈ సెల్ఫీతో కిమ్ మామ భగ్గుమన్నారు. ఈ సెల్ఫీని ప్రపంచం యావత్తు కొనియాడింది. రెండు దేశాల మధ్య శాంతికి ఇది చిహ్నంగా ఈ సెల్ఫీ నిలుస్తుందంటూ ప్రపంచ దేశాలు కొనియాడాయి. కానీ ఆ దేశాలకు కిమ్ మామ సంగతి పూర్తిగా తెలిసినట్లు లేదు. తేడా వస్తే సొంత కుటుంబ సభ్యులనే కాటికి పంపిన చరిత్ర కిమ్‌ది. ఇక సొంత దేశస్తులు శతృదేశంతో సంబరాలు సెల్ఫీలా.. కిమ్ అహం మీద దెబ్బగొట్టారు. కలలో కూడా దక్షిణ కొరియాను తలవని కిమ్.. అతని దేశస్తులు ఇలా చేస్తే వదులుతాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
సంబరాలు గింబరాలు జాన్తా నై
ఉత్తరకొరియా దేశస్తులు తమ శతృదేశంతో కానీ విదేశీయులతో కానీ కలిసి సంబరాలు చేసుకోరాదనేది వారి సిద్ధాంతాల్లో ఒకటి.అయితే ఒలింపిక్స్‌లో ఉత్తర కొరియా క్రీడాకారులు దక్షిణ కొరియా క్రీడాకారులతో సెల్ఫీలు దిగి సంబరాలు చేసుకోవడాన్ని నేరంగా పరిగణిస్తోంది. వాస్తవానికి పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు వెళ్లక ముందే క్రీడాకారులకు విదేశీయులతో కలవడం కానీ, వారితో కలిసి సంబరాలు చేసుకోవడం కానీ చేయకూడదనే గైడ్‌లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఆ ఆదేశాలను వారు ఉల్లంఘించడంతో కిమ్ కోపానికి గురయ్యారు. వారికి శిక్ష వేయడం తథ్యంగా తెలుస్తోంది. అయితే ఈ శిక్ష ఎలా ఉంటుంది, ఎంత కఠినంగా ఉంటుందనేదే ఇప్పుడు ఉత్తరకొరియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చూశారుగా... ఆకు వెళ్లి ముల్లు మీద పడ్డా.. ముళ్లు వెళ్లి ఆకుపై పడ్డా చిరిగేది మాత్రం ఆకే.. ఇప్పుడు ఉత్తరకొరియా క్రీడాకారుల పరిస్థితి కూడా అదేలా కనిపిస్తోంది. కిమ్ మామనా.. ఇంకేమన్నానా..!!












Click it and Unblock the Notifications