వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిమ్ వారసురాలు ఎంట్రీ: ఇక ఆ దేశాలకు టెర్రరే..! కిమ్‌కంటే వంద రెట్లు ఎక్కువగా..!

|
Google Oneindia TeluguNews

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్... ఒక్కసారి కమిట్ అయితే తన మాట తానే వినని వ్యక్తి. భూమికి ఉండేది జానడే అయినా తన చేష్టలతో చర్యలతో అగ్రరాజ్యాలనే వణికిస్తాడు. ప్రస్తుతం ఈ నియంత ఆరోగ్య పరిస్థితి బాగాలేదనే వార్తలు గుప్పుమన్నాయి. కిమ్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. అంతేకాదు కిమ్ తర్వాత ఆయన వారసత్వం ఎవరు అందిపుచ్చుకుంటారనే దానిపైనా చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ జాంగ్ ఉన్ వారసత్వాన్ని ఆమె సోదరి కిమ్-యో-జాంగ్ అందిపుచ్చుకుంటారనే ప్రచారం జరుగుతోంది.

 కిమ్‌ వారసురాలిగా సోదరి కిమ్ యో జాంగ్..?

కిమ్‌ వారసురాలిగా సోదరి కిమ్ యో జాంగ్..?

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయన వారసత్వం ఎవరు అందిపుచ్చుకుంటారా అనే చర్చ ప్రారంభమైంది. కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ ఉత్తరకొరియా అధ్యక్షురాలుగా అవుతారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇప్పటికే ఉత్తరకొరియా దేశంపై కిమ్ యో జాంగ్ పూర్తిగా పట్టు సాధించారని సమాచారం. ఈ మేరకు ప్రపంచ దేశాలకు ఉత్తరకొరియా హెచ్చరికలు కూడా పంపినట్లు సమాచారం. అయితే తన అన్న కిమ్ జాంగ్ ఉన్‌ లక్షణాలను చెల్లి కిమ్ యో జాంగ్‌ వంటబట్టించుకున్నారనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇక కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక ఈమె ఎంపిక దాదాపు ఖరారైనట్లు సమాచారం. ఇక కిమ్ వంశంలో కిమ్ జాంగ్ ఉన్ తర్వాత అంతటి నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తిగా కిమ్ సోదరి కిమ్ యో జాంగ్ గుర్తింపు పొందారు.

 అన్నలానే చెల్లి కూడా కఠినస్తురాలే..?

అన్నలానే చెల్లి కూడా కఠినస్తురాలే..?

గత నెలలో దక్షిణ కొరియా చేపట్టిన మిలటరీ విన్యాసాల సందర్భంగా కిమ్ యో జాంగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భయపడిన కుక్క మొరుగుతోందంటూ దక్షిణ కొరియాను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు చేయడం ద్వారా కిమ్ జాంగ్ ఉన్న సోదరి వెలుగులోకి వచ్చింది. ఇక దక్షిణ కొరియాపై ఈ వ్యాఖ్యలు చేయాల్సిందిగా స్వయంగా తన అన్న కిమ్‌జాంగ్ ఉన్ పురమాయించినట్లు పరిశోధకుడు యాంగ్‌షిక్ బాంగ్ చెప్పారు. అంతేకాదు తన సోదరి కిమ్ యో జాంగ్‌ తనలా వ్యవహరించాలని ఇప్పటికే కిమ్ జాంగ్ ఉన్‌కు సూచనలు చేసినట్లు సమాచారం.

మెలుకువలు నేర్చుకుంటున్న కిమ్ యో జాంగ్

మెలుకువలు నేర్చుకుంటున్న కిమ్ యో జాంగ్

ఇక దేశంపై ఇప్పటికే పట్టు సాధిస్తున్న కిమ్ యో జాంగ్... నాయకత్వ లక్షణాలు అలవర్చుకునేందుకు మరిన్ని మెలుకువలు నేర్చుకుంటున్నట్లు సమాచారం. ఇక 36 ఏళ్ల కిమ్ జాంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి రోజురోజుకూ విషమిస్తుండటంతో కిమ్ యో జాంగ్ త్వరలోనే ఆదేశ పగ్గాలు చేపడతారనే వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. ఇక కిమ్ జాంగ్ ఉన్‌ను కలవాలంటే ఆయన సోదరికి మాత్రమే ఆ అవకాశం ఉందని ఉత్తరకొరియాకు చెందిన సీనియర్ లెక్చరర్ లియోనిడ్ పెట్రావ్ చెప్పారు. ఆమెకు మిలటరీతో కానీ ఇతర పాలనా వ్యవహారంతో కానీ ప్రత్యక్షంగా సంబంధం లేనప్పటికీ అన్నిటిపై పట్టు సాధిస్తున్నారని లియోనిడ్ పెట్రావ్ చెప్పారు. ఇక కిమ్ యో జాంగ్‌ను కిమ్ జాంగ్ ఉన్ ఎక్కువగా నమ్ముతారని అదే సమయంలో విదేశీనాయకులతో , దక్షిణ కొరియాతో ఎలా డీల్ చేయాలో కిమ్‌ను గైడ్ చేస్తూ ఉంటుందని చెప్పారు.

Recommended Video

Top 14 Beautiful Love Stories Of Famous Cricketers & Bollywood Divas || Oneindia Telugu
 తాత జయంతి ఉత్సవాలకు కిమ్ గైర్హాజరు

తాత జయంతి ఉత్సవాలకు కిమ్ గైర్హాజరు

ఇక కిమ్ జాంగ్ ఉన్ తాతాకు సంబంధించిన ఓ ముఖ్యమైన కార్యక్రమంలో ఉత్తరకొరియా అధ్యక్షుడు కనిపించకపోయే సరికి అందరిలోనూ కిమ్ పై అనుమానాలు మొదలయ్యాయి. అప్పుడే తన ఆరోగ్యంపై పలు అనుమానాలు రేకెత్తాయి. తన తాత, తండ్రిలకు సంబంధించిన జయంతి కార్యక్రమాలను కిమ్ ఎప్పుడూ మిస్ కాలేదని తెలుస్తోంది. ఇక కిమ్ జాంగ్ ఉన్ అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఉత్తరకొరియాకు సంబంధించిన ఏ ముఖ్యమైన కార్యక్రమాన్ని మిస్ కాలేదని కానీ తన తాతకు సంబంధించిన జయంతి కార్యక్రమం గైర్హాజరవడంపై అనుమానాలు బలపడినట్లు పలువురు అభిప్రాయపడుతున్నారు.

English summary
Dictator Kim Jong-un’s little sister is fast becoming his “alter ego” and is tightening her grip on the country, the world has been warned.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X