కుల్ భూషణ్ కేసు: ఆగని పాక్ కుట్రలు.. జైలుకు మన లాయర్లు.. అడుగడుగునా అడ్డగింత..
సంచలనాత్మక కుల్ భూషణ్ జాదవ్ కేసులో పాకిస్తాన్ వంకర బుద్ది మరోసారి బయటపడింది. అక్కడి ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను పైకోర్టులో సవాలు చేసేందుకు జాదవ్ నిరాకరించారంటూ పాక్ చేసిన ప్రచారం వట్టిదేనని తేలింది. గురువారం భారత లాయర్లు పాక్ జైలులో జాదవ్ ను కలిశారు. కానీ తనతో ఫ్రీగా మాట్లాడనీయకుండా అడుగడుగునా ఆటంకాలు, అవాంతరాలు సృష్టించారు.
జాదవ్ ను కలిసిన లాయర్ల బృందం నుంచి ఈ మేరకు రిపోర్టు అందిందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ్ మీడియాకు తెలిపారు. జాదవ్ న్యాయసహాయాన్ని నిరాకరించాడంటూ పాకిస్తాన్ ప్రచారం చేసిన మాట అవాస్తవమని వెల్లడైంది. అయితే, మరణ శిక్షపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసేందుకు అవసరమైన సంతకాలు కూడా పెట్ట నీయకుండా పాక్ అధికారులు అనుచితంగా వ్యవహరించారని శ్రీవాస్తవ చెప్పారు. మరణ శిక్ష రివ్యూకు ఈనెల 20 తో గడువు ముగియనుండగా, జాదవ్ కు న్యాయ సహాయం విషయంలో పాక్ కల్పించిన అవకాశం అర్థంలేనిదిగా భావించాలని భారత అధికారులు అంటున్నారు.
పాకిస్తాన్ లో గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ కు న్యాయసహాయం అందించాల్సిందేనని అంతర్జాతీయ కోర్టు ఆదేశించడంతో పాక్ ఈ మేరకైనా దిగొచ్చింది. గతేడాది సెప్టెంబర్ లో మొదటిసారి లాయర్లను కలిసే అవకాశమిచ్చిన పాక్.. మళ్లీ ఇన్ని నెలలల తర్వాతగానీ రెండో దఫా భేటీకి అనుమతించలేదు. జైలులో జాదవ్ తో మాట్లాడిన లాయర్ల బృందం పంపిన రిపోర్టును బట్టి.. రివ్యూ పిటిషన్ వేయకుండా ఆపేందుకు అక్కడి అధికారులు యత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. గడువులోగా పిటిషన్ పేపర్లపై జాదవ్ సంతకాలు చేసేందుకు పాక్ అనుమతివ్వని పక్షంలో భారత్ మరోసారి అంతర్జాతీయ కోర్టును ఆశ్రయించే అవకాశముంది.

కుల్ భూషణ్ కు న్యాయసహాయంపై భారత్ అభ్యర్థనను విచారించిన అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే).. పాక్ తీరును తీవ్రంగా ఎండగట్టడం తెలిసిందే. పాకిస్తాన్ ఆర్మీ కోర్టు జాదవ్ కు విధించిన మరణశిక్షపై ఇస్లామాబాద్ హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఈనెల 20తో ముగియనుంది. గడువు వృధా అయ్యేలా పాక్ అనేక కుయుక్తులు పన్నింది. జాదవ్ కు న్యాయ సహాయం అందించకపోవడం వియన్నా ఒప్పందాన్ని తుంగలో తొక్కడమేనని, నాలుగ్గోడల మధ్య ఏకపక్షంగా సాగిన విచారణ ఓ ప్రహసనం అని ఐసీజే పేర్కొన్న సంగతి విదితమే.
Recommended Video
-
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్‌కు తాకట్టు -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!












Click it and Unblock the Notifications