వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజీనామాకు ఓకే.. కానీ తనతోపాటు ఫ్యామిలీని విదేశాలకు సేఫ్‌గా తరలించాలి: రాజపక్సే

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌కి చేరింది. ప్రధాని, అధ్యక్షుడు రాజీనామా వరకు వెళ్లింది. ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేయగా.. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే మాత్రం బుధవారం చేస్తానని చెప్పాడు. ఇంటి నుంచి పారిపోయాడు. ఆయనకు వీసా ఇచ్చేందుకు అమెరికా నిరాకరించింది. ఇంతలో తన కుటుంబాన్ని దేశం నుంచి సురక్షితంగా పంపిస్తేనే రాజీనామా చేస్తానని చెబుతున్నాడు. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

 Lanka president puts condition ahead of resignation

రాజపక్సే ప్రతిపాదనలపై చర్చలు కూడా జరుగుతున్నాయట. అయితే ప్రతిపక్షం మాత్రం అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. 3 రోజుల క్రితం రాజీనామా చేస్తానని తెలిపారు. సమయం మాత్రం దగ్గరకు వచ్చింది. కానీ ఏం ఫలితం లేదు. తన రాజీనామా కన్నా ముందే.. కుటుంబంతోపాటు తాను సురక్షితంగా విదేశాలకు వెళ్లాలని షరతు విధిస్తున్నారు. రాజపక్సే పోదసరుడు బాసిల్‌ను ఇవాళ విమానాశ్రయంలో నిలిపివేశారు. రాజపక్సే రాజీనామా చేయకుంటే పరిస్థితి మరోలా ఉంటుంది.

ఇటు ప్రధాని విక్రమసింఘే రాజీనామా ప్రకటించారు. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు. దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి. కానీ ఆయన పూటకో మాట మాట్లాడుతున్నాడు.

English summary
Sri Lanka President Gotabaya Rajapaksa has hinted he will not resign till his family gets a safe exit from the country.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X