కిమ్‌కు ట్రంప్ షాక్: ఉ.కొరియాపై యుద్దానికి అమెరికా రె'ఢీ'

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ఉత్తర కొరియాకు చర్యలకు చెక్ పెట్టేందుకు అమెరికా సన్నద్దమౌతోంది. ఉత్తరకొరియా అధ్యక్షుడు అనుసరిస్తున్న విధానాలకు అమెరికాతో పాటు మిత్ర దేశాలు ఎప్పుడూ కూడ బెదరవని అమెరికా ప్రకటించింది.ఉత్తరకొరియాను ఎదుర్కోనేందుకుగాను సైనిక అవకాశాలను కూడ పరిశీలిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

టెన్షన్: నవంబర్‌లో ద.కొరియాకు ట్రంప్ , కిమ్‌కు 50 కి.మీ. దూరమే

ఉత్తరకొరియా నుండి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అమెరికా ముందు అనేక అవకాశాలున్నాయని ఆ దేశం ప్రకటించింది. జపాన్ గగనతలం నుండి వెళ్ళేలా ఉత్తరకొరియా శుక్రవారం నాడు క్షిపణి ప్రయోగం చేసింది. దీనిపై అమెరికా తీవ్రంగా స్పందించింది.

ట్విస్ట్: కిమ్ వెనుక ఆ రెండు దేశాలు, కట్టడి చేయాలి: అమెరికా

ఉత్తరకొరియా ఎత్తుగడలను తిప్పికొట్టేందుకు తమ వద్ద సమర్థమైన, విస్తృతమైన అవకాశాలున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఉత్తరకొరియాకు ధీటుగా బుద్దిచెప్పాలని అమెరికా కూడ భావిస్తోంది.

ఉత్తరకొరియాపై ట్రంప్ ఆగ్రహం

ఉత్తరకొరియాపై ట్రంప్ ఆగ్రహం

ఉత్తరకొరియా సెప్టెంబర్ 15న, క్షిపణి ప్రయోగడం చేయడంతో అమెరికా తీవ్ర ఆగ్రహన్ని వ్యక్తం చేసింది. ఉత్తరకొరియాపై సైనిక చర్యకు కూడ రెఢీగా ఉన్నామని అమెరికా ప్రకటించింది. ఆ దేశాన్ని ఎదుర్కోవడానికి సైనిక అవకాశాలూ పరిశీలనలో ఉన్నాయని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు హెచ్‌.ఆర్‌.మెక్‌ మాస్టర్‌ పేర్కొన్న నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ‘‘మీ సామర్థ్యం, నిబద్ధతను చూశాక.. ఈ ముప్పును ఎదుర్కోవడానికి మనకున్న అవకాశాలు చాలా సమర్థమైనవి, విస్తృతమైనవన్న విశ్వాసం నాకు కలుగుతోంది'' అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. దీంతో ఉత్తరకొరియాపై అమెరికా సైనిక చర్యకు దిగే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

అమెరికాను రక్షించుకొంటాం

అమెరికాను రక్షించుకొంటాం


అమెరికా వైమానిక దళ 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం నాడు వాషింగ్టన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ట్రంప్ పాల్గొన్నారు. ‘‘మన జీవన విధానానికి ముప్పు కలిగించేందుకు సాహసించే వారి నుంచి మన ప్రజలను, దేశాలను, మన నాగరికతను రక్షించుకుంటాం. ఈ ముప్పు కలిగించే వారిలో ఉత్తర కొరియా పాలకులూ ఉన్నారు. తన పొరుగు దేశాలు, అంతర్జాతీయ సమాజం పట్ల మరోసారి ధిక్కార ధోరణిని ప్రదర్శించారు'' అని ట్రంప్ అభిప్రాయపడ్డారు.

జపాన్‌తో పోన్‌లో చర్చలు

జపాన్‌తో పోన్‌లో చర్చలు


ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష తర్వాత అమెరికా రక్షణ మంత్రి జేమ్స్‌ మ్యాటిస్‌.. జపాన్‌ రక్షణ మంత్రి ఇత్సునోరి ఒనోడెరాతో ఫోన్‌లో తాజాగా నెలకొన్న పరిస్థితులపై చర్చించారు. జపాన్‌ రక్షణకు, ఈ ప్రాంత విస్తృత భద్రతకు అమెరికా కట్టుబడి ఉందని మ్యాటిస్‌ హామీ ఇచ్చారు. ఉత్తర కొరియా చర్యకు స్పందనగా.. అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియాలు ఉమ్మడిగా చర్యలు చేపట్టాలని ఇద్దరు నేతలూ అంగీకరించా

అమెరికాకు ధీటుగా ఎదిగిన ఉ.కొరియా

అమెరికాకు ధీటుగా ఎదిగిన ఉ.కొరియా


సైనిక శక్తి విషయంలో అమెరికాతో సమానత్వాన్ని సాధించాలన్న లక్ష్యానికి తమ దేశం చేరువవుతోందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ చెప్పారు. అమెరికా తట్టుకోలేని రీతిలో ప్రతిదాడిని చేసేలా అణ్వస్త్ర సామర్థ్యాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలనూ తీసుకోనున్నట్లు వివరించారు. తమపై సైనిక చర్యకు దిగే సాహసాన్నీ అమెరికా చేయలేని రీతిలో సమతౌల్యాన్ని సాధించనున్నట్లు తెలిపారు.

ట్రంప్‌కు కిమ్ షాక్: అమెరికాను బూడిద చేస్తాం: ఉ. కొరియా

ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ ప్రపంచదేశాలు హెచ్చరిస్తున్నా కానీ, తన ప్రవర్తనను మార్చుకోవడం లేదు .ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉత్తరకొరియాపై మరిన్ని ఆంక్షలు విధించడంపై కిమ్ మండిపడ్డాడు. జపాన్, అమెరికాలను తీవ్రంగా హెచ్చరించారు. ఈ హెచ్చరికలు చేసిన కొద్దగంటల్లోనే జపాన్ గగనతలం మీదుగా క్షిపణి ప్రయోగానికి పూనుకోవడం విశేషం.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
North Korea's latest ballistic missile test has renewed discussion at the highest levels of the Trump administration about how military force could be used to stop Kim Jong Un's development of nuclear warheads and ballistic missiles

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X