‘ఆ జీన్స్ వేసుకున్న అమ్మాయిలపై రేప్ చేయాల్సిందే’:లాయర్ వివాదాస్పదం

Subscribe to Oneindia Telugu

కైరో: ఈజిప్టుకు చెందిన ఓ న్యాయవాది తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చిరిగిన జీన్స్ వేసుకున్న అమ్మాయిలు, మహిళలపై అత్యాచారం చేయాల్సిన బాధ్యతను అందరూ తీసుకోవాలని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రపంచ నలుమూలల నుంచి ఆగ్రహజ్వలాలు వ్యక్తమవుతున్నాయి.

వివరాల్లోకి వెళితే.. అల్‌ అస్సీమా ఈజిప్ట్‌కు చెందిన జాతీయ చానెల్‌ వ్యభిచారంపై చట్టాన్ని చేయడంపై చర్చించేందుకు కొందరు నిపుణులను షోకు ఆహ్వానించింది. చర్చకు వచ్చిన వారిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నబీ అల్‌ వాల్ష్‌ అనే కన్జర్వేటివ్‌ న్యాయవాది కూడా ఉన్నారు.

Lawyer says it’s a ‘duty to rape’ women wearing ripped jeans

చర్చలో పాల్గొన్న ఓ మహిళతో నబీకు వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా రిప్డ్‌ జీన్స్‌(చిరిగిన జీన్స్) వేసుకునే ప్రతి అమ్మాయిని లైంగిక వేధించాలని, అలాంటి వారిని రేప్‌ చేయడం 'జాతీయ బాధ్యత'గా భావించాలని నబీ అన్నారు.

చిరిగిన జీన్స్ వేసుకున్ని శరీర భాగాలను అందరికి కనిపించేలా అమ్మాయిలు తిరగడమేంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఈజిప్టు మహిళా కమిషన్‌.. న్యాయవాది నబీ, సదరు టీవీ ఛానెల్‌పై ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు చెప్పింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An Egyptian lawyer has sparked outrage after saying women who wear ripped jeans deserve to be sexually harassed and raped.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి