మోస్ట్ పవర్ ఫుల్ డ్రోన్ లు కలిగిన 5 దేశాలు ఇవే.. భారత్ స్థానం ఎంత..?

ప్రస్తుతం డ్రోన్ టెక్నాలజీ హవా నడుస్తోంది. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, భారత్- పాకిస్థాన్ యుద్ధంలో డ్రోన్ లనే అధికంగా వినియోగించారు. మోడ్రన్ యుద్ధాల్లో డ్రోన్ ల వినియోగం చాలా పెరిగింది. అమెరికాకు చెందిన ఎంక్యూ- 9 రీపర్ నుంచి టర్కీకు చెందిన బేరక్తార్ టీబీ2, చైనాకు చెందిన వింగ్ లూంగ్ 2 డ్రోన్ లు, అలాగే రష్యాకు చెందిన ఓకోట్ నిక్, ఇజ్రాయెల్ కు చెందిన హెర్మెస్ 900 డ్రోన్ లు ప్రస్తుతం మోస్ట్ పవర్ ఫుల్ డ్రోన్ లు గా ఉన్నాయి.

అమెరికాలో ప్రస్తుతం అత్యాధునిక పవర్ ఫుల్ ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ లు ఉన్నాయి. ఈ డ్రోన్ లు ఏకధాటిగా 27 గంటలపాటు నింగిలోనే ఉండి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాయి. దాదాపు 1,700 కిలోల పే లోడ్ ను ఇవి మోసుకెళ్లగలవు. యుద్ధ వాతావరణం కలిగిన ప్రాంతాలైన అఫ్గానిస్తాన్, సిరియాలో ఈ డ్రోన్ లను అమెరికా వినియోగిస్తోంది. అలాగే సెన్సార్ సామర్థ్యం, ఏఐ వినియోగం ఈ డ్రోన్ లకు ఉంది. ఏరో టైమ్ అనే సంస్థ రిపోర్ట్ ప్రకారం డ్రోన్ వ్యవస్థలో అమెరికా టాప్ ప్లేస్ లో ఉంది.

టర్కీకు చెందిన బేరక్తార్ టీబీ2 అలాగే TAI అంకా డ్రోన్ లు రెండో స్థానంలో ఉన్నాయి. టర్కీకు చెందిన బేరక్తార్ టీబీ2 డ్రోన్ లు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి. తక్కువ ఖర్చుతో యుద్ధ నైపుణ్యాలను ప్రదర్శించడం ఈ డ్రోన్ ల ప్రత్యేకత. అలాగే వీటిని కొత్త వెర్షన్ TAI అంకా డ్రోన్ లు దాదాపు 30 గంటలపాటు ఏకధాటిగా పనిచేయగలవు. అడ్వాన్స్ డ్ డిజైన్లు ఈ డ్రోన్ లు కలిగిఉన్నాయి. డ్రోన్ మార్కెట్ లో టర్కీకి పెద్ద మార్కెట్ ఉంది.

చైనాకు చెందిన CAIG వింగ్ లూంగ్-2 డ్రోన్లు, అలాగే CH-5 రెయిన్ బో డ్రోన్లు మూడో స్థానంలో ఉన్నాయి. ఇవి 60 గంటలపాటు నింగిలోనే తమ సామర్థ్యాలను ప్రదర్శించగలవు. అలాగే దాదాపు 1000 కేజీల పే లోడ్ ను మోసుకెళ్లగలవు. వీటిని మరింత అప్ గ్రేడ్ చేసేందుకు చైనా యత్నిస్తోంది. ఈ డ్రోన్ లకు హైటెక్ సెన్సార్ లతో పాటు లాంగ్ రేంజ్ స్ట్రైకింగ్ సామర్థ్యాన్ని అమర్చనుంది.

రష్యాకు చెందిన Kronshtadt ఓరియాన్ డ్రోన్ లు అలాగే S-70 ఓకోట్నిక్ డ్రోన్ లు నాలుగో స్థానంలో ఉన్నాయి. రష్యా అభివృద్ధి చేసిన ఈ డ్రోన్ లు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లగలవు. జెట్స్ మాదిరిగానే ఈ ఫ్లైయింగ్ డ్రోన్ లు పనిచేస్తాయి. అలాగే హెవీ పే లోడ్స్ ను కూడా మోసుకెళ్లగలవు.

Leading the Skies The 5 Countries with Cutting-Edge Drone Capabilities

ఇక ఇజ్రాయెల్ కు చెందిన హెర్మెస్ 900 డ్రోన్ లు ఈ రిపోర్టులో ఐదో స్థానంలో ఉన్నాయి. ఇవి 36 గంటలపాటు ఏకధాటిగా పనిచేయగలవు. 350 కేజీల వరకు పే లోడ్ ను మోసుకెళ్లగలవు. వీటికి అడ్వాన్స్ డ్ సెన్సార్లు, ఇతర ఆయుధాలను అమర్చారు. బోర్డర్ సేఫ్టీ, నిఘా వ్యవస్థ, ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఈ డ్రోన్ లను వినియోగిస్తారు. ఇక ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డ్రోన్ మార్కెట్ గణనీయంగా విస్తరిస్తోంది. 2035 నాటికి 30 బిలియన్ డాలర్లు మార్కెట్ ఏర్పాటు కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+