83 ఏళ్లకు అందిన లెటర్, 1931లో రాసిన యువతి
స్కోహెగాన్: ఓ ఉపాధ్యాయురాలు తన తల్లికి రాసిన లేఖ 83 ఏళ్ల తర్వాత చేరిందట. మైన్ స్కూల్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు 1931లో 150 మైళ్ల దూరంలో ఉన్న తన తల్లికి రాసిన ఈ లేఖ ఎట్టకేలకు ఎనిమిది దశాబ్దాల తర్వాత చేరింది. ఇరవై మూడేళ్ల మిరియమ్ మెక్ మైకేల్ అనే యువతి 21 పేజీల లేఖను రాసింది.
ఆ లేఖను హోల్టన్ నుండి పిట్స్‌ఫీల్డ్‌లో ఉన్న తన తల్లి డొలెనా మెక్ మైకేల్‌కు పోస్ట్ చేసింది. అయితే, ఈ లేఖ ఇటీవల పిట్స్‌ఫీల్డ్‌లోని పోస్ట్ బాక్స్‌లో లభ్యమైంది. ప్రస్తుతం ఆ లేఖ రాసిన కూతురు, లేఖ అందుకోలేని తల్లి.. ఇద్దరు కూడా మృతి చెందారు.

అయితే, ఆ లేఖ పోస్టు బాక్స్‌లో ఇప్పుడు దొరికింది. పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తున్న మైకెల్ రోవెల్‌కు ఈ లేఖ దొరికింది. ఆ లేఖ పైన రెండు సెంట్ల స్టాంప్స్ ఉన్నాయని, ఇది చాలా పాత లెటర్ అని ఆమె చెప్పింది.
అయితే, ఆ పోస్టల్ లేఖ పైన ఉన్న అడ్రస్‌ను పట్టుకునేందుకు పోస్టల్ అధికారులు, ఇతర అధికారులు ప్రయత్నించి సఫలమయ్యారు. ఎట్టకేలకు ఆ లేఖను 69 ఏళ్ల ఆన్ మెక్ మైకేల్‌కు ఇచ్చారు. ఆన్ మెక్ మైకేల్... ఉత్తరం రాసిన మిరియమ్ మెక్ మైకేల్‌కు కోడలు కాగా ఉత్తరం అందుకోలేని ఆ తల్లి డొలెనా మెక్ మైకెల్‌కు మనవరాలు. కుటంబ సభ్యులు స్పెల్లింగ్ ప్రస్తుతం మారింది.












Click it and Unblock the Notifications