పార్కింగ్‌లో భారీ అగ్ని ప్రమాదం, 1400 కార్లు దగ్ధం: కార్లు పేలుతున్న శబ్దాలు

Posted By:
Subscribe to Oneindia Telugu

లండన్: బ్రిటన్‌లోని లివర్ పూల్ నగరంలో ఓ బిల్డింగులోని పార్కింగ్ భవంతిలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. చిన్నగా మొదలైన ఈ మంటలు తీవ్ర రూపం దాల్చడంతో అందులో ఉన్న 1400కు పైగా కార్లు దగ్ధమయ్యాయి.

ప్రమాదస్థలికి పక్కనే ఉన్న లివర్ పూల్ ఎకో ఎరినాలో అంతర్జాతీయ గుర్రాల ప్రదర్శన జరుగుతోంది. మంటలు చెలరేగుతుండటంతో ప్రదర్శన కోసం గ్యారేజీలో ఉంచిన వందల గుర్రాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రదర్శన వాయిదా వేశారు.

Liverpool Echo Arena car park fire destroys 1,400 vehicles

ఆదివారం మొదలైన మంటలు సోమవారం ఉదయానికి తగ్గిపోయాయి. ఏడు అంతస్తుల పార్కింగ్ భవంతిలో అగ్నికి ఆహుతైన వాహనాలు శిథిలాలుగా కనిపించాయి. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు. కార్లు దగ్ధం కావడంతో వాటి యజమానులకు అధికారులు అత్యవసర వసతి కల్పించారు.

అక్కడ నిలిచి ఉన్న కార్లలోని రెండు శునకాలను అధికారులు రక్షించారు. ప్రమాదం సమయంలో ఆ రెండు జంతువులు తప్ప ఎవరూ లేరని చెప్పారు. ప్రజలు సురక్షితంగా ఉన్నారని, గుర్రాలకు ప్రమాదం తప్పిందని చెప్పారు.

మంటలు వచ్చినప్పుడు కొద్ది సేపట్లోనే కార్లు పేలుతున్న శబ్దాలు వినిపించాయని సాక్షులు తెలిపారు. అక్కడ నిలిచిన పాత ల్యాండ్ రోవర్ కారు ఇంజిన్‌లో దట్టమైన పొగతో నిప్పు రవ్వలు వచ్చాయని చెప్పారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A huge fire has destroyed up to 1,400 vehicles in a multi-storey car park in Liverpool, forcing many people to spend New Year's Eve in a temporary shelter.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి