జ్యూవెల్లరీ ఎత్తుకెళ్లిన ఆ యువతులు, హోమోసెక్సువల్ అని నరికేసిన ఐసిస్
సిరియా: ఐసిస్‌కు మద్దతు పలికిన లండన్‌కు చెందిన ముగ్గురు స్కూల్ యువతులు తమ ఇళ్లలో నుండి బంగారు ఆభరణాలు దొంగిలించారట. పోలీసులు ఈ విషయాన్ని చెప్పారు. ఐసిస్‌లో చేరేందుకు ముగ్గురు యువతులు వెళ్లిన విషయం తెలిసిందే.
వారు ముగ్గురు తమ ఇళ్లలోని తమ కుటుంబ సభ్యుల బంగారు ఆభరణాలను దొంగిలించి ఉంటారని, వాటి ద్వారానే వారు సిరియాకు వెళ్లి ఉంటారని చెబుతున్నారు. వాటిని తమ ప్రయాణం కోసం ఉపయోగించుకుని ఉంటారన్నారు.
కదిజా సుల్తానా (16), షమీమా బేగం (15), అమీరా అబాసేలు గత నెల ఇస్తాంబుల్‌కు పారిపోయారు. అక్కడి నుండి వారు ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్లారని భావిస్తున్నారు. వారి ముగ్గురే కాకుండా మరో 26 మంది బ్రిటిష్ యువతులు ఐసిస్‌లో చేరి ఉంటారని చెబుతున్నారు.

ముగ్గురి నరికివేత!
ఐసిస్ ఉగ్రవాదులు అరాచకాలు కొనసాగుతున్నాయి. దైవ దూషణ చేశారని, హోమోసెక్సువాలిటికీ (స్వలింగ సంపర్కం) పాల్పడ్డారని ముగ్గురిని నరికి చంపారు. ఈ సంఘటన ఇరాక్‌లోని నార్తర్న్ సిటీలో జరిగినట్లు ఐసిస్ మిలిటెంట్స్ పేర్కొన్నారు. ముగ్గురిని కూడా మోకాళ్ల పైన కూర్చోబెట్టి కత్తితో నరికారు. అతని పక్కన ఆయుధాలతో కొందరు ఉన్నారు. ఈ సంఘటనను అక్కడున్న వారు చూస్తూ కనిపించారు.












Click it and Unblock the Notifications