వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా సమూల నియంత్రణ ఇప్పట్లో లేనట్టే.. డబ్ల్యుహెచ్‌వో కీలక ప్రకటన

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ఆవిర్భావమే సరిగా తెలియలేదు. వ్యాక్సిన్ వచ్చినా.. ఏదో అలా తీసుకుంటున్నారు. కానీ ఇప్పటికీ గందరగోళం ఉంది. దీనికి ఊతమిచ్చే విధంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాట్లాడుతోంది. మహమ్మారి అంతానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనామ్‌ తెలిపారు.

పటిష్ఠమైన వైద్యారోగ్య చర్యల ద్వారా కొన్ని నెలల వ్యవధిలో దీన్ని నియంత్రించగలమని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది తొలి రెండు నెలల గణాంకాలు చూస్తే... మరణాలు, కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. దీంతో వైరస్‌ను నియంత్రించగలమని.. వేరియంట్లను అడ్డుకోగలమన్న విషయం స్పష్టమైందన్నారు.

 long way to end pandemic: who director general

గత ఏడు వారాలుగా కేసులు క్రమంగా పెరుగుతున్నాయని టెడ్రోస్‌ తెలిపారు. ప్రస్తుతం కీలక దశలో ఉన్నామని పేర్కొన్నారు. గత వారంలో కేసుల సంఖ్యలో 9 శాతం.. మరణాల్లో 5 శాతం వృద్ధి నమోదైందని తెలిపారు. కొన్ని దేశాల్లో కరోనా విజృంభిస్తున్నప్పటికీ.. ఇంకా నైట్‌ క్లబ్‌లు, రెస్టారెంట్లు, మార్కెట్లు జనాలతో కిటకిటలాడుతున్నాయని తెలిపారు. ఇక కొంతమంది తాము యువకులం కాబట్టి కరోనా సోకినా ఏమీ కాదన్న ధోరణితో వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

English summary
long way to end pandemic: who director general tedros said to media.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X