కేరళ అమ్మాయి.. స్కాట్లాండ్ ఎంపీ.. గురువాయూర్‌లో ఒక్కటైన ప్రేమజంట!
దేశం, భాష, కులం, మతం, వయస్సు లేదా భౌగోళిక సరిహద్దులతో సంబంధం లేకుండా అందరినీ ఒక్కటి చేసే శక్తి ప్రేమ. నిజమైన ప్రేమకు ఎలాంటి అడ్డంకులు, పరిమితులు ఉండవని నిరూపించే అనేక ఘటనలు ప్రతిరోజూ మనం చూస్తూనే ఉంటాం. తాజాగా మనస్సులు కలిస్తే ఎన్ని అడ్డంకులు ఎదురైనా ప్రేమ పక్షులు ఒక్కటవుతాయని నిరూపించే ఘటన చోటుచేసుకుంది. స్కాట్లాండ్ ఎంపీ మార్టిన్ డే, కేరళలోని త్రిస్సూర్ జిల్లాకు చెందిన నిధిన్ చాంద్‌ను గురువాయూర్ శ్రీకృష్ణ ఆలయంలో మంగళవారం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వివాహ వేడుక ఉదయం 11 గంటలకు గురువాయూర్ ఆలయంలో జరగగా.. అనంతరం పుష్పాంజలి ఆడిటోరియంలో వివాహ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇరువైపుల బంధువులు, అత్యంత ఆప్తమిత్రులతో పాటు నిధిన్ 22 ఏళ్ల కుమారుడు వేదిక్ శంకర్ హాజరయ్యారు. వివాహానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.
2008లో మొదలైన పరిచయం
ఈ జంట ప్రేమకథ 2008లో యూకేలో ప్రారంభమైంది. బీటెక్ పూర్తి చేసిన అనంతరం నిధిన్ ఛాంద్ ఐటీ మేనేజ్మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ కోసం యూకే వెళ్లారు. నిధిన్ చాంద్ ఎర్నాకులం జిల్లా పిరవం సమీపంలోని పంబక్కుడకు చెందిన రిటైర్డ్ వెటర్నరీ ఆఫీసర్ కేఎన్ చాంద్, మాజీ గ్రామ పంచాయతీ సభ్యురాలు రాజమ్మల ఏకైక కుమార్తె. ఆ తర్వాత ఆమె పీహెచ్‌డీ కూడా పూర్తి చేశారు.

వీసా పోరాటం నుంచి ప్రేమ వరకు
నిధిన్ చాంద్ యూకేలో ఉన్న సమయంలో అక్కడి వీసా నిబంధనలలో మార్పులు రావడం వల్ల విదేశీ విద్యార్థులతో పాటు ఆమె కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యపై ఆమె పార్లమెంటరీ కమిటీల ముందు విద్యార్థుల తరఫున గళం విప్పారు. ఆ పోరాట సమయంలోనే అప్పటి యూకే పార్లమెంట్ సభ్యుడు, స్కాటిష్ నేషనల్ పార్టీ నాయకుడైన మార్టిన్ డేతో ఆమెకు పరిచయం ఏర్పడింది. తొలుత స్నేహంగా ప్రారంభమైన ఈ బంధం 2016లో ప్రేమగా మారింది. నిధిన్ చాంద్ విడాకులు తీసుకున్న మహిళ కావడం, 12 ఏళ్ల కొడుకు ఉండటంతో మొదట కాస్త సంకోచించినా మార్టిన్ ఆమెను, ఆమె కుమారుడిని ఎంతో ప్రేమగా స్వీకరించారు.
9 ఏళ్ల నిరీక్షణ తర్వాత తీరిన కోరిక
నిధిన్ చాంద్‌కు గురువాయూర్ శ్రీకృష్ణుడి సమక్షంలో కళ్యాణం చేసుకోవాలనేది సుదీర్ఘకాల కోరిక. అయితే వీసా, నివాస ప్రక్రియల కారణంగా తొమ్మిదేళ్ల క్రితమే వీరి వివాహం యూకేలో చట్టబద్ధంగా నమోదైంది. గతంలో 2018, 2019, 2023లలో వీరు కేరళ సందర్శించినప్పటికీ కేరళ వరదలు, కొవిడ్ మహమ్మారి, కుటుంబ సభ్యుల అనారోగ్యం వల్ల గురువాయూర్ ఆలయ దర్శనం, కళ్యాణం వాయిదా పడుతూ వచ్చాయి. ఎట్టకేలకు మార్టిన్ డే నాలుగో సారి కేరళకు వచ్చిన సందర్భంగా నిధిన్ చాంద్ కల నెరవేరింది. ప్రస్తుతం మార్టిన్ డే స్కాటిష్ ఎంపీగా సేవలందిస్తుండగా.. నిధిన్ చాంద్ కు మేనేజ్మెంట్ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నారు.
Scottish MP Martyn Day marries Keralite Nitin Chand at Guruvayur.
— News Arena India (@NewsArenaIndia) August 19, 2026
Nitin, a native of Piravom in Ernakulam district, moved to the UK in 2008 for higher studies in IT management, where she met Day. pic.twitter.com/qm088aWsZO













Click it and Unblock the Notifications