పెను భూకంపం.. 200 మందికిపైగా మృతి

మయన్మార్, థాయ్‌లాండ్‌లలో చోటు చేసుకున్న పెను భూకంపానికి భారీ ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. నిమిషాల వ్యవధిలో సంభవించిన వరుస భూకంపాల తీవ్రతతో మయన్మార్‌లో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ రెండు దేశాల్లో మృతుల సంఖ్య ఇప్పటివరకు 200కి చేరినట్లు సమాచారం. ఒక్క మయన్మార్ లోనే 180కిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

కూలిన ఎత్తైన భవనాల కింద చిక్కుకొని హాహాకారాలు చేస్తున్నవారిని రక్షించేందుకు రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. మయన్మార్​‌లో 12 నిమిషాల వ్యవధిలో సంభవించిన రెండు భారీ భూకంపాలు భారీ నష్టాన్ని కలిగించాయి. రాజధాని నెపిడాతోపాటు మరికొన్ని నగరాల్లో ఎక్కడచూసినా కూలిన భవనాలు, బీటలు వారిన రోడ్లే దర్శనిస్తున్నాయి.

Major earthquake in Myanmar Thailand Over 200 dead

ఎటు చూసినా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. రిక్టర్ స్కేల్​పై మొదటి భూకంపం తీవ్రత 7.7గా, రెండో భూకంపం తీవ్రత 6.4గా నమోదైంది. ఆ తర్వాత మరో నాలుగు ప్రకంపనలు వచ్చాయి. వాటి తీవ్రత 4.5నుంచి 6.6 మధ్యన ఉన్నట్లు మయన్మార్ అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య వందల్లో ఉండే ప్రమాదం ఉందని తెలుస్తోంది. మయన్మార్​లోని ఓ ఆస్పత్రి శవాల దిబ్బను తలపిస్తోంది. మయన్మార్​లోని సాగింగ్ నగరానికి 16 కిలోమీటర్ల దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు.

భూకంపం ధాటికి మయన్మార్​‌లో అనేక భవనాలతోపాటు మాండలే నగరంలోని ఐవా ఐకానిక్ వంతెన నదిలో కుప్పకూలింది. విద్యుత్ స్తంభాల నేలకూలడంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. భూకంపం తీవ్రతకు మయన్మార్ రాజధాని నేపిడాలోని 1,000 పడకల ఆస్పత్రి కుప్పకూలింది. అత్యధికంగా అక్కడే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చని తెలుస్తోంది. కొత్తగా ఈ ఆస్పత్రిని నిర్మించారు.

మరోవైపు థాయ్‌లాండ్‌​లోనూ భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్​పై తీవ్రత 7.7గా నమోదైంది. బ్యాంకాక్​‌లోనూ నష్టం భారీగానే ఉన్నట్లు సమాచారం. పలు చోట్ల బహుళ అంతస్థుల భవనాల పైఅంతస్తుల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి నీరు ఎగసిపడ్డాయి. థాయ్ లాండ్ లో పదుల సంఖ్యలో మరణాలు సంభవించగా.. భారీగా ఆస్తినష్టం జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+