• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇదేం వింత హాబీ రా బాబూ: చెడ్డీలతో చెలగాటమా.... లోపలకు పంపిన లోదుస్తులు

|

సాధారణంగా మనిషికి ఏదైనా ఇష్టమైన వస్తువు కావాలనే కోరిక కలిగితే దాన్ని పొందేందుకు ఎంత దూరమైనా ప్రయాణించి పొందుతాడు. ఇంకొందరైతే తమకు దక్కాల్సినది దక్కకుంటే పట్టుదలతో ప్రయత్నించి దక్కించుకుంటారు. కానీ ఇక్కడ ఒకతను కూడా అంతే పట్టుదలతో తనకు ఇష్టమైన వస్తువుల కోసం దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించాడు. అయితే ఆ వస్తువులు కలెక్ట్ చేయడం హాబీ అట. ఇంతకీ ఆయన హాబీ ఏంటి..?

న్యూజిలాండ్‌కు చెందిన స్టీఫెన్ గ్రాహం గార్డనర్ అనే వ్యక్తి ఉన్న హాబీ ఏంటో తెలిస్తే జుగుప్స కలుగుతుంది. ఛీ..ఛీ అనిపిస్తుంది. కానీ ఏం చేద్దాం స్టీఫెన్‌కు ఆ వస్తువులు కలెక్ట్ చేయడమే హాబీగా పెట్టుకున్నాడు. ఇంతకీ ఆ వస్తువులేమిటో తెలుసా..? అక్కడికే వస్తున్నాం. మహిళల లోదుస్తులు కలెక్ట్ చేయడమంటే స్టీఫెన్‌కు భలే సరదా...ఇంతకీ స్టీఫెన్ వయసెంతో తెలుసా.... అక్షరాల 65 ఏళ్లు. మరి ఈ వయస్సులో ఈ పాడుబుద్ధి ఏమిటో తెలియక నెలిజెన్లు ఈయన స్టోరీ విని అసహ్యించుకుంటున్నారు. ఉత్తర ఒటాగోకు చెందిన స్టీఫెన్ మహెనో నుంచి డునేడిన్‌కు తన వాహనంలో బయలు దేరాడు. ఎందుకో తెలుసా.. 8 జతల మహిళల ప్యాంటీస్ దొంగతనం చేసేందుకట. అయితే గురుడు దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు.

Man arrested for stealing ladies lingerie,admits it was his hobby

స్టీఫెన్‌ను పోలీసులు పట్టుకున్నాక డునెడిన్ జిల్లా కోర్టులో హాజరుపర్చారు. దొంగతనం ఎందుకు చేశావ్ అని జడ్జి అడుగగా.. ఇందుకు స్టీఫెన్ సమాధానం ఇచ్చాడు. తాను ఏదో నేరం చేయాలన్న ఉద్దేశంతో దొంగతనం చేయలేదని కేవలం ప్యాంటీస్ కలెక్ట్ చేయడం తన హాబీ అని అందుకోసమే ఈ అండర్‌వేర్లను దొంగతనం చేసినట్లు జడ్జి ముందు ఒప్పుకున్నాడు. స్టీఫెన్ సమాధానం చాలా ఎబ్బెట్టుగా అనిపించింది. ఇదిలా ఉంటే స్టీఫెన్ తరపున వాదించిన న్యాయవాది... తన క్లయింట్ నేరం చేయాలన్న ఉద్దేశంతో వెళ్లలేదని మోఆనా పూల్‌లోని స్పాకు వెళ్లాడని... పూల్‌లో ఉండగా ప్యాంటీస్‌ను చోరీ చేయాలన్న ఆలోచన వచ్చిందని వాదించారు. మొత్తానికి చోరీ చేశాడని ఒప్పుకోవడంతో స్టీఫెన్‌కు 11నెలలు సాధారణ జైలు శిక్ష విధించారు జడ్జి. అంతేకాదు 1000 డాలర్ల జరిమానా కూడా విధించారు. మొత్తానికి చెడ్డీలతో చెలగాటమాడిన ఈ వ్యక్తి అదే లోదుస్తులు జైలు లోపలికి పంపాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Travelling a long distance to acquire objects that are greatly desired is something very common among collectors. However, a man from New Zealand has shocked netizens and local authorities for his bizarre hobby of collecting women's underwear, for which he covered a total distance of 100 kilometer.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more