వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కంచెదూకి వైట్‌హౌస్‌లోకి కత్తితో వ్యక్తి, ఒబామా వెళ్లగానే

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ ఉత్తర లాన్‌లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు గమనించడంతో వైట్ హౌస్‌లో కొంతభాగాన్ని కొద్దిసేపు ఖాళీ చేయించారు. శుక్రవారం రాత్రి పొద్దుపోయాక ఒక వ్యక్తి కంచె దూకి ఉత్తర పోర్టికో ద్వారాల గుండా భవనంలోకి ప్రవేశించాడు. అయితే భద్రతా దళాలు వెంటనే అతడ్ని పట్టుకున్నాయి.

టెక్సాస్‌కు చెందిన 42 ఏళ్ల ఒమర్ గోంజాలెజ్‌ను ద్వారాల దగ్గరలోనే పట్టుకున్నట్లు ఆ చానల్ తెలిపింది. ఈ సంఘటనపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోందని, అమెరికా సీక్రెట్ సర్వీస్ పరిస్థితిని పూర్తిగా సమీక్షిస్తుందని ఆ అధికారి తెలిపారు. అయితే గోంజాలెజ్ అక్కడిదాకా ఎలా చేరుకున్నాడనేది మాత్రం తెలియరాలేదు.

Man held for unlawfully entering White House was armed: US Attorney's Office

అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన కుమార్తెలు దక్షిణ లాన్‌ నుంచి వెళ్లిపోయిన కొద్దిసేపటికే ఈ సంఘటన చోటుచేసుకుంది. అతను శ్వేత సౌధం రక్షణ కంచె పైకి ఎక్కి ఎగబాగి.. లోపలకు దూకి అక్కడి సువిశాలమైన పచ్చికలో వేగంగా పరుగెత్తి నేరుగా సింహద్వారం వద్దకు చేరుకున్నాడు.

అతడు కంచె పైనుండి దూకి పరుగెత్తడాన్ని గమనించిన భద్రతా సిబ్బంది, అధికారులు ఒక్కసారిగా అప్రమత్తమై అతనిని పట్టుకున్నారు. వెంనటే శ్వేతసౌధంలోని కొంత భాగం నుండి సిబ్బందిని అప్పటికప్పుడు ఖాళీ చేయించారు. ఈ ఘటన పైన దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, అతని చేతిలో కత్తి ఉన్నట్లుగా తెలుస్తోంది.

English summary
The man arrested in Texas on Friday for intruding into the White House was armed with a knife, the US Attorney's Office said on Saturday, the Reuters reported. The intruder climbed the fence and made it into the mansion after President Barack Obama had left.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X