Wife: ఫ్యామిలీలో 7 మందిని కాల్చి చంపేసి ఏం చేశాడంటే ?, అమెరికా అధ్యక్షుడే షాక్, మ్యాటర్ భార్యతో !
వాషింగ్టన్/అమెరికా: వివాహం చేసుకున్న దంపతులు చాలా సంతోషంగా కాపురం చేశారు. దంపతుల అన్యోన్య జీవితానికి సాక్షంగా ఐదు మంది పిల్లలు ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి ఇంటి యజమాని చాలా సంతోషంగా జీవించాడు. అయితే ఇటీవల ఆ దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. భార్య తల్లికూడా వారితోనే ఉంది. భార్య విడాకులు కావాలని మొండిపట్టు పట్టింది. భార్యను పద్దతి మార్చుుకోవాలని భర్త చెబుతూ వస్తున్నాడు. ఏం చెయ్యాలో తెలీక భర్త ఫ్యామిలీ మొత్తాన్ని ఒకేసారి, ఒకేచోట చంపేయడం కలకలం రేపింది.ఈ సంఘటనతో అమెరికా అధ్యక్షుడు, ఆయన సతీమణితో పాటు రెండు రాష్ట్రాల గవర్నర్లు షాక్ అయ్యారు.

అమెరికాలో తుపాకి సాంప్రధాయం
అమెరికాలో ఓ వ్యక్తి తన భార్య, ఐదుగురు పిల్లలతో సహా ఏడుగురిని చంపి ఆత్మహత్యకు పాల్పడటంతో అందరూ షాకి అయ్యారు. అత్యంత దారుణమైన తుపాకీ సంస్కృతి ఉన్న దేశాల్లో అమెరికా కూడా ఒకటి అనే విషయం తెలిసిందే. అమెరికాలో పెరుగుతున్న కాల్పుల ఘటనల కారణంగా ఇటీవలి కాలంలో తుపాకీ నియంత్రణకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.

ఒకే ఫ్యామిలీ
తుపాకీ హింస సర్వసాధారణమైన అమెరికా దేశంలో ఒక కుటుంబంలో 7 మందిని హత్య చేసిన ఇంటి పెద్ద తరువాత అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనతో అమెరికా ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలోని ఊటాలో నివాసం ఉంటున్న మైఖేల్ హైగ్డ్ అతని భార్య తౌషా, 5 మంది పిల్లలతో పాటు భార్య తల్లి గెయిల్ ఐరాల్‌తో కలిసి నివసిస్తున్నాడు.

విడాకులు ఇవ్వాలని కోర్టులో అర్జీ
కొంతకాలంగా మైఖేల్, తౌసా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. 41 ఏళ్ల భర్తతో విడిపోవాలని తౌసా డిసైడ్ అయ్యింది. మైఖేల్ తో తనకు విడాకులు ఇప్పించాలని అతని భార్య తౌషా రెండు వారాల క్రితం కోర్టులో దరఖాస్తు చేసుకుంది. అయితే తనకు ఎందుకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావు అంటూ మైఖేల్ అతని భార్య తౌషాను ప్రశ్నించినా ఆమె కచ్చితమైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.

ఫ్యామిలీ మొత్తం అంతం చేసిన మైఖేల్
మైఖేల్, తౌషా దంపతుల విడాకులకు కచ్చితమైన కారణం మాత్రం తెలియరాలేదు. ఈ సందర్భంలో మైఖేల్ అతని భార్య తౌషా, కుమార్తె మున్రు, ఇద్దరు కొడుకులు, అత్తగారి గెయిల్‌తో సహా ఐదుగురు పిల్లలను తుపాకితో దారుణంగా కాల్చి చంపాడు. ఆ తరువాత మైఖేల్ కూడా తుపాకితో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అమెరికా అధ్యక్షుడు షాక్
మైఖేల్ అతని ఫ్యామిలీలో 7 మందిని హత్య చేసి అతను ఆత్మహత్య చేసుకున్న ఈ దారుణ ఘటన యావత్ అమెరికాను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఆయన భార్య జిల్ బైడన్ తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అలాగే ఉటా గవర్నర్, ఎనోచ్ మేయర్ కూడా ఈ సంఘటనకు సంబంధించి దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. విడాకులే ఇంత మంది హత్యలకు కారణమా ?, లేక మరేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసు ఉటా పోలీసు అధికారులు తెలిపారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications