Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చొక్కాపై చొక్కా.. 15 షర్ట్స్ ధరించాడు.. ఎందుకో తెలిస్తే షాకే..! (వీడియో)

ఎడిన్‌బర్గ్‌ : లగేజ్ ఛార్జీలు తప్పించుకోవడానికి ఓ ప్రయాణికుడు చేసిన వింత ప్రయత్నం.. విమానాశ్రయ అధికారులకు తెలిస్తే కంగు తింటారేమో. అడిషనల్ లగేజ్ ఛార్జీల మోత తప్పించుకోవడానికి ఓ ప్లాన్ వేశాడు. అనుకున్నది తడవుగా ఆ ప్లాన్ అమలు చేశాడు కూడా. ఎయిర్‌పోర్టులో అందరూ చూస్తుండగానే ఆ పని కానిచ్చేశాడు.

MAN PUTS ON 15 LAYERS OF CLOTHING RATHER THAN PAY AIRLINES EXCESS BAGGAGE FEE

గతంలో మాంచేస్టర్‌కు చెందిన ఓ మహిళ లగేజి ఛార్జీల మోత భరించలేక చేసిన పని అప్పట్లో నెట్టింట్లో వైరల్ గా మారింది. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. సదరు లేడీ లగేజి ఛార్జీల అదనపు భారం తగ్గించుకోవడానికి తన ఒంటిపై ఏడు డ్రెస్సులు ధరించింది. అదే కోవలో మరో వ్యక్తి ప్రవర్తించిన తీరు విస్మయం కలిగిస్తోంది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

గ్లాస్గోకు చెందిన జాన్ ఇర్విన్ తన కుటుంబంతో కలిసి ఎడిన్‌బర్గ్ కు పయనమయ్యాడు. అయితే ఎయిర్‌పోర్టు రూల్స్ ప్రకారం ప్రయాణీకులు తమ వెంట కేవలం 8 కిలోల బరువున్న లగేజ్ మాత్రమే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అంతకన్నా లగేజ్ మించితే నిర్ణీత రుసుము కట్టాల్సి ఉంటుంది. అయితే అది కట్టడం ఎందుకని భావించిన జాన్ తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు.

లగేజీ ఎక్కువుందన్న కారణంగా తన బ్యాగులోంచి చొక్కాలన్నీ బయటకు తీశాడు. అలా ఒక్కో చొక్కాను ఒంటిపై వేసుకుంటూనే ఉన్నాడు. అలా దాదాపు 15 చొక్కాలు ధరించాడు. అయితే అక్కడే ఉన్న ప్రయాణీకులు ఎవరో ఆ సన్నివేశాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరలయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+