ఒళ్లంతా కత్తిపోట్లు.. గుండెలో దిగిన కత్తి! అయినా నడుచుకుంటూ ఆసుపత్రికెళ్లాడు..

ఊహించని విపత్తు ఎదురైనప్పుడు చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఎలాగైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవాలకున్నాడు.

న్యూయార్క్: ఊహించని విపత్తు ఎదురైనప్పుడు చాలామందికి ఏం చేయాలో అర్థం కాదు. కానీ, ఓ వ్యక్తి మాత్రం ఎలాగైనా సరే తన ప్రాణాలు కాపాడుకోవాలకున్నాడు. దానికోసం అతడు చేసిన ప్రయత్నం అందరినీ ఆశ్చర్యపరచడమేకాదు, మెచ్చుకునేలా చేసింది.

న్యూయార్క్ కు చెందిన ముహ్మద్‌ రమీరాజ్‌ (35)పై సోమవారం గుర్తు తెలియని దుండగులు కొందరు దాడి చేశారు. మక్‌నిష్‌ వీధిలో అతడ్ని కింద పడేసి కత్తిపోట్లతో అతని ఒళ్లంతా హూనం చేశారు. చివరకు ఓ కత్తిని అతన్ని గుండెల్లో దింపి పరారయ్యారు.

అయితే ఎలాగైనా బతకాలన్న తాపత్రయంతో రమీరాజ్‌ లేచి నిల్చున్నాడు. రక్తం ధారలుగా కారుతున్నా.. ఏ మాత్రం ఆందోళన చెందకుండా ముందుకు నడవసాగాడు. ఆ పక్కనే ఐదు బ్లాకుల తరువాత ఉన్న ఎల్మ్ హర్స్ట్ ఆసుపత్రికి చేరుకున్నాడు.

Man stabbed in the heart walks 5 blocks to hospital with knife still in chest

ముందు అతడ్ని చూసి అక్కడి వైద్యులు షాక్‌ తిన్నా.. వెంటనే కోలుకొని హుటాహుటిన అతనికి వైద్య చికిత్సలు అందించారు. అయితే అతని పరిస్థితి మాత్రం ఇంకా విషమంగానే ఉన్నట్లు సమాచారం. అతడు చూపించిన ధైర్యం, చొరవ అందరి ప్రశంసలు పొందాయి.

కత్తి కొన అతడి గుండెకు తీవ్ర గాయం చేయటంతో బతికే అవకాశాలు చాలా తక్కువేనని వైద్యులు చెబుతున్నారు. మరోవైపు పోలీసుల వేట కూడా మొదలైంది. అతడ్ని కత్తితో పొడించింది ఎవరు? అనే దానిపై ఆరాతీసేందుకు వారు సీసీటీవీ పుటేజ్ పరిశీలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+