పిల్లలను అమ్మేశాడు: ఉరి తీశారు

చైనా: శిశువులను కొనుగోలు చేసి మరో ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా అమ్మేసిన వ్యక్తిని చైనాలో ఉరి తీశారు. చైనాకు చెందిన టాన్ యాంగ్జీ (69) అనే వ్యక్తిని శుక్రవారం సెంట్రల్ చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో ఉరి తీశామని సుప్రీం పీపుల్స్ కోర్టు (ఎస్ పీసీ) వెల్లడించింది.

2008 నుంచి 2013వరకు టాన్ యాంగ్లీ మరో ఇద్దరితో కలిసి నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్ ప్రాంతంలో పిల్లలను కొనుగోలు చేశాడు. తరువాత హెనన్ ప్రావిన్స్ ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడ వేరే వ్యక్తులకు అమ్మేశాడు.

Man trafficking 22 infants executed in central China

ఇలా మొత్తం 22 మంది పిల్లలను అమ్మేశాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అతనిని అరెస్టు చేశారు. 2014లో కోర్టు ఇతనికి ఉరి శిక్ష అమలు చేసింది. అయితే తాను పిల్లలు లేని వారిని పిల్లలను అప్పగించానని, వారికి న్యాయం చేశానని కోర్టులో సమర్థించుకున్నాడు.

అయితే మగ పిల్లలను 30,000 యువాన్లకు, ఆడ పిల్లలను 16,000 యువాన్లకు కొనుగోలు చేశాడని, ఒక్కోక్కరి మీద మూడు వేల యువాన్ల లాభం తీసుకుని విక్రయించాడని పోలీసు అధికారులు సాక్ష్యాలు సంపాధించి కోర్టులో సమర్పించడంతో ఉరి శిక్ష అమలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+