వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Pakistan Train Accident: ఎదురెదురుగా రెండు రైళ్ల ఢీ- 30 మంది మృతి

|
Google Oneindia TeluguNews

దక్షిణ పాకిస్తాన్‌లోని సింధ్‌ ప్రావిన్స్‌లో ఈ ఉదయం ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఇందులో దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. సింధ్ ప్రావిన్స్ లోని ఘోట్కీ రేతి, ధహర్కి రైల్వే స్టేషన్‌ మధ్య సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ - మిల్లట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఒకదానికొకటి ఢీ కొనడంతో ఈ ఘోరం చోటుచేసుకుంది.

Recommended Video

TOP NEWS : Donald Trump On China Over COVID19 | Oneindia Telugu

లాహోర్ నుంచి కరాచీకి వెళ్తున్న సర్ సయ్యద్‌ ఎక్స్ ప్రెస్‌.. కరాచీ నుంచి సర్గోధాకు వెళ్లే మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొంది. ఈ ఘటనలో 13నుంచి 14 బోగిలు పట్టాలు తప్పినట్లు సమాచారం.
ముందుగా మిల్లత్‌ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ బోగీలు పక్కనే ఉన్న ట్రాక్‌పైకి చేరడంతో ఎదురుగా వస్తున్న సర్‌ సయ్యద్‌ ఎక్స్‌ప్రెస్‌ దీన్ని ఢీకొట్టింది. దీంతో దాని బోగీలు కూడా పట్టాలు తప్పి పడిపోయాయి.ఘటన జరిగిన సమయంలో ఇరు రైళ్లలో కలిపి దాదాపు 1100 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం.

Many killed as two trains collide in southern Pakistan: Officials

రైలు ప్రమాదం జరగగానే స్ధానిక గ్రామాల ప్రజలు వెంటనే స్పందించి క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు తరలించారు. ప్రమాద స్ధలిలో రైళ్లను తొలగిస్తేనే కానీ ఇంకా మృతుల సంఖ్య ఎంత అనేది తేలేలా లేదు. ఇందుకు భారీ యంత్ర సామాగ్రి అవసరమవుతున్నట్లు అధికారులు చెప్తున్నారు. రైళ్ల ప్రమాదంపై పాకిస్తాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ స్పందించారు. రైలు ప్రమాదంతో తాను షాక్‌కు గురయ్యానని, రైల్వే మంత్రిని తక్షణం ప్రమాదస్ధలికి వెళ్లాలని ఆదేశించినట్లు ఇమ్రాన్‌ ట్వీట్‌ చేశారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని రైల్వేశాఖకు ఆదేశాలు ఇచ్చామన్నారు.

English summary
At least 30 passengers killed and dozens injured after Millat Express derailed and Sir Syed Express train hit it soon afterwards in Sindh province.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X