Elon Musk Vs Mark Zuckerberg : ఎలాన్ మస్క్-జుకర్ బర్గ్ మ్యాచ్ లో భారీ ట్విస్ట్ ?
అంతర్జాతీయ సోషల్ మీడియా దిగ్గజాలు ఎలాన్ మస్క్, మార్క్ జుకర్ బర్గ్ ల మధ్య కొంతకాలంగా సీరియస్ పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ట్విట్టర్ ను కొనుగోలు చేసిన మస్క్ దాని పేరును ఎక్స్ గా మార్చి కొత్త లుక్ ఇస్తుంటే... దానికి పోటీగా ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ మెటా థ్రెడ్స్ పేరుతో మరో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ను అందుబాటులోకి తెచ్చాడు. దీంతో ఇరువురి మధ్య పోటీ మరింత ముదిరింది. ఇందులో భాగంగా వరుసగా ఇద్దరు జెయింట్స్ మధ్య మాటలతూటాలు పేలాయి.
కానీ తాజాగా సీన్ మారిపోయింది. మార్క్ జుకర్ బర్గ్ తో పోటీ పడి తన ఎక్స్ ను కాపాడుకోవడం కష్టమేనని భావించోడో, లేక మరేదైనా కారణం ఉందో తెలియదు కానీ ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గాడు. దీనికి ఆరోగ్య సమస్యల్ని కారణంగా చూపాడు. దీనికి బదులుగా జుకర్ బర్గ్ ఇంటి పెరట్లో ఆడుకుందామని ఆఫర్ ఇచ్చాడు. దీంతో జుకర్ బర్గ్ కూడా అంతే వ్యంగంగా స్పందించాడు. దీంతో పాటు ఎలాన్ మస్క్ తో ఈ కేజ్ ఫైట్ ను ముగిస్తున్నట్లు జుకర్ బర్గ్ ప్రకటించాడు. ఈ మేరకు తాజాగా తన థ్రెడ్స్ లో పోస్ట్ చేశాడు.

తనకు, ఎలాన్ మస్క్‌కి మధ్య కేజ్ ఫైట్ మ్యాచ్ జరుగుతుందనే ఊహాగానాల నుండి ఇది "ముందుకు వెళ్లాల్సిన సమయం" అంటూ మార్క్ జుకర్‌బర్గ్ తన థ్రెడ్స్ లో పోస్ట్ చేశారు. ఎలాన్ సీరియస్ గా లేడని మనమంతా అంగీకరించగలం అంటూ అందులో జుకర్ బర్గ్ పేర్కొన్నాడు. ఎలాన్ మస్క్ తో మ్యాచ్ కోసం తాను తేదీని ఇచ్చానని, డానా వైట్ దీనిని చట్టబద్ధమైన పోటీగా మార్చాలని కోరాడని జుకర్ బర్గ్ తెలిపాడు. కానీ ఎలాన్ ఆ తేదీని నిర్ధారించలేదన్నాడు.

ఆ తర్వాత ఎలాన్ మస్క్ తనకు సర్జరీ అవసరమని చెప్పాడని, కాబట్టి మ్యాచ్ కు బదులుగా తన పెరట్లో ప్రాక్టీస్ చేద్దామని ప్రతిపాదించాడని జుకర్ బర్గ్ తెలిపాడు. ఎలాన్ ఇప్పటికైనా నిజంగా మ్యాచ్ తేదీ, అధికారికంగా ఆడటంపై సీరియస్ గా ఉంటే తనను ఎలా సంప్రదించాలో కూడా అతనికి తెలుసన్నాడు. కాబట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నాడు. క్రీడల్ని సీరియస్ గా తీసుకునే తాను మాత్రం పోటీపై దృష్టిపెడతానన్నాడు. ఎలాన్ సీరియస్ గా లేడు కాబట్టి ప్రస్తుతానికి దీన్ని ముగించి ముందుకు వెళ్తామన్నాడు.












Click it and Unblock the Notifications