వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారీ విరాళం: జుకర్ బర్గ్ వినూత్న ఆలోచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ తనకు కూతురు పుట్టిన సందర్భంగా భారీగా విరాళం ప్రకటించారు. ఈ విరాళాన్ని వినూత్న రీతిలో ముందుకు తీసుకు వెళ్లనున్నారు. 'చాన్ జూకర్‌బర్గ్ ఇనిషియేటివ్' ప్రాజెక్టుకు అందిస్తున్న ఈ విరాళాలు నేరుగా రాజకీయ చందాలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి.

వ్యాపారాల్లో పెట్టుపడులుగా కూడా మార్చుకోవచ్చు. తద్వారా లాభాలు కూడా రాబట్టుకునే అవకాశం ఉంది. సాధారణంగా ఏదైనా దాతృత్వ సంస్థ లేదా సంప్రదాయ చార్టీ సంస్థల మాదిరి కాకుండా 'చాన్ జూకర్‌బర్గ్ ఇనిషియేటివ్'ను లిమిటెడ్ లయబులిటీ కంపెనీ (ఎల్ఎల్సీ)గా ఏర్పాటు చేయనున్నారు.

దీని వల్ల రాజకీయ చందాలు, లాబీయింగులతో పాటు వ్యాపారాల్లో పట్టుబడులు పెట్టే వెసులుబాటు ఉంటుంది. తన కూతురు పుట్టిన రోజు సందర్భంగా జుకర్ బర్గ్ తన షేర్లలో 99 శాతాన్ని విరాళంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Mark Zuckerberg Defends His Foundation's Legal Structure

బిల్ గేట్స్‌కు చెందిన గేట్స్ ఫౌండేషన్ లాభాపేక్ష లేకుండా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పటి వరకు దాదాపు అందరు వ్యాపారవేత్తలు ఇలాగే ఇస్తూ వచ్చారు. అయితే జుకర్ బర్గ్ మాత్రం వినూత్నంగా ఆలోచించారు. గేట్స్ ఫౌండేషన్ వంటివి పన్నులు చెల్లించవు. కానీ 'చాన్ జూకర్‌బర్గ్ ఇనిషియేటివ్' మాత్రం పన్ను చెల్లించాలి.

జుకర్ బర్గ్... వ్యాధుల నివారణ, వినూత్న విద్యా విధానం, ఇంటర్నెట్‌ను విస్తృతం చేయడం వంటి వాటి పైన దృష్టి సారించవచ్చునని తెలుస్తోంది. మరోవైపు, తన భూరి విరాళం పైన విమర్శలు చేసే వారికి జుకర్ బర్గ్ కౌంటర్ ఇచ్చారు. వివరణ ఇచ్చారు.

English summary
Two days after announcing plans to donate $45 billion over time to his family foundation, Facebook CEO Mark Zuckerberg responded to criticism about his philanthropic ambitions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X