Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Facebook crash: జుకర్‌బర్గ్ ఆస్తులు ఆవిరి: కొన్ని గంటల్లోనే: ఆ లిస్ట్ నుంచి అవుట్

వాషింగ్టన్: తిరుగులేని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌గా ఉంటూ వచ్చిన ఫేస్‌బుక్ జాతకం ఒక్కసారిగా తలకిందులైంది. ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటల పాటు స్తంభించిపోయిందీ ప్లాట్‌ఫామ్. ఫేస్‌బుక్‌కే చెందిన వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ సైతం క్రాష్‌కు గురయ్యాయి. వాటిల్లో యాక్సెస్ పొందడానికి వినియోగదారులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ఆ తరువాత వాటిని పాక్షికంగా పునరుద్ధరించినట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం ప్రకటించింది. పునరుద్ధరణ ప్రక్రియ కొనసాగుతోందని తెలిపింది.

Recommended Video

    Mark Zuckerberg Loses $6 Billion In Hours As Facebook Plunges || Oneindia Telugu

    ఈ పరిణామాలు.. ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు, ముఖ్య కార్యనిర్వహణాధికారి మార్క్ జుకర్‌బర్గ్‌ను ఆర్థికంగా దెబ్బకొట్టాయి. కొన్ని గంటల వ్యవధిలో బిలియన్ల కొద్దీ డాలర్లను నష్టపోయారు జుకర్‌బర్గ్. సుమారు ఏడు బిలియన్ డాలర్ల మేర ఆస్తులు ఆవిరి అయ్యాయి. దీని దెబ్బకు ప్రపంచ కుబేరుల జాబితాలో ఆయన స్థానం దిగజారింది. అమెరికన్ స్టాక్ మార్కెట్‌లో ఫేస్‌బుక్ షేర్ల విలువ అమాంతం పడిపోయింది. 4.9 శాతం మేర క్షీణించాయి.

    Mark Zuckerberg Loses $7 Billion in Hours after Facebook and WhatsApp Plunges

    ఏడు బిలియన్ డాలర్ల మేర నష్టాలను చవి చూశాయి ఫేస్‌బుక్ షేర్లు. దీనితో జుకర్‌బర్గ్ ఆస్తులు 140 బిలియన్ డాలర్ల నుంచి 121.6 డాలర్లకు దిగజారాయి. ఫలితంగా జుకర్‌బర్గ్ టాప్ త్రీ నుంచి అయిదో స్థానానికి దిగజారాడు. ఎలాన్ మాస్క్, జెఫ్ బెజోస్, బెర్నార్డ్ అర్నాల్ట్, బిల్ గేట్స్ తరువాత మార్క్ జుకర్‌బర్గ్ చేరాడు.

    ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది వినియోగదారులు వాట్సప్‌ను యూజ్ చేయలేకపోయినట్లు తెలుస్తోంది. అలాగే. కోట్లాదిమంది యూజర్లు ఫేస్‌బుక్‌లో యాక్సెస్ పొందలేకపోయారు. తమ అకౌంట్లను తాము ఓపెన్ చేయలేకపోయారు. వెబ్ వర్షన్‌లో చోటు చేసుకున్న సాంకేతిక కారణాల వల్ల ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ స్తంభించిపోయాయంటూ వార్తలు వస్తున్నాయి. వాటిని పాక్షికంగా పునరుద్ధరించినట్లు ఫేస్‌బుక్ యాజమాన్యం తెలిపింది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+