వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లైంగిక వేధింపులు: అలస్కా ఎయిర్‌లైన్స్ తీరుపై జుకర్‌బర్గ్ సోదరి ఆగ్రహం

|
Google Oneindia TeluguNews

న్యూయార్క్: సామాన్యులకే కాదు, ప్రముఖులకు కూడా వేధింపులు తప్పడం లేదు. తాజాగా, ఫేస్‌బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సోదరికి జరిగిన లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయం ఆమే స్వయంగా వెల్లడించారు.

విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో ఓ వ్యక్తి తనను వేధిస్తుంటే అలాస్కా ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని జుకర్‌బర్గ్‌ సోదరి రాండీ జుకర్‌బర్గ్‌ ఆరోపించారు. ఈ విషయాన్ని రాండీ ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

 తాగి అసభ్యంగా..

తాగి అసభ్యంగా..

ప్రస్తుతం రాండీ ఫేస్‌బుక్‌ మార్కెటింగ్‌ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆమె అలాస్కా ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో మెక్సికోకు ప్రయాణించారు. ఆ సమయంలో తన పక్క సీటులో ఉన్న ఓ ప్రయాణికుడు తాగి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

 సిబ్బందికి చెబితే..

సిబ్బందికి చెబితే..

ఈ విషయంపై సిబ్బందికి ఫిర్యాదు చేస్తే అతను తరచూ ఈ విమానంలో ప్రయాణిస్తుంటాడని ఏమీ పట్టించుకోవద్దని చెప్పి వెళ్లిపోయారట. దీంతో దాదాపు మూడు గంటల పాటు ఆ వ్యక్తి తనను వేధించినట్లు రాండీ వెల్లడించారు.

 సిబ్బంది తీరుపై రాండీ ఆగ్రహం

సిబ్బంది తీరుపై రాండీ ఆగ్రహం

ఆ తర్వాత అలాస్కా ఎయిర్‌ కార్పొరేట్‌ స్టాఫ్‌కు ఈ విషయాన్ని వివరిస్తూ మెయిల్‌ చేసినట్లు చెప్పారు. ఈ మెయిల్‌లో అలస్కా విమాన సిబ్బంది తీరుపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.

 సిబ్బంది వైఖరి దారుణం.. సంస్థ స్పందించింది..

సిబ్బంది వైఖరి దారుణం.. సంస్థ స్పందించింది..

పైగా ఆ వ్యక్తితో విమాన సిబ్బంది జోకులు వేసుకుంటూ అడిగినంత మద్యం ఇస్తూనే ఉన్నారని రాండీ ఆరోపించారు. దీనిపై అలాస్కా సంస్థ ప్రతినిధి ఎగన్‌ స్పందిస్తూ.. రాండీ పట్ల జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడతామని హామీ ఇచ్చారు.

English summary
Mark Zuckerberg's sister has written a scathing letter of complaint to Alaska Airlines claiming she was sexually harassed on one of their flights and that their crew allowed it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X