పెళ్లి కావాలి.. కోబోయే భార్యకు 50 గదుల కోట, కోట్ల ఆస్తి ఫ్రీ.. కానీ !!
వయసు కేవలం ఒక అంకె మాత్రమేనని చాలామంది నమ్ముతారు. కానీ, 80 ఏళ్ల వయసులో జీవిత భాగస్వామి కోసం అన్వేషిస్తూ బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సర్ బెంజమిన్ స్లేడ్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశమవుతోంది. తన అపారమైన సంపదకు, వారసత్వానికి వారసుడిని కోరుకుంటూ, ఒక యువతిని వివాహం చేసుకోవాలనే ఆయన ఆశయం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
బ్రిటన్‌లోని సోమర్సెట్లో ఉన్న చారిత్రక కట్టడం 'మాన్సెల్ హౌస్’ (Maunsel House)కు బెంజమిన్ యజమాని. 50 గదులతో, అద్భుతమైన తోటలతో ఈ రాజభవనం అత్యంత ఖరీదైనది. తన తర్వాత ఈ భారీ సామ్రాజ్యాన్ని చక్కదిద్దే ఒక వారసుడు కావాలనే ఆకాంక్షతో ఆయన తోడును వెతుకుతున్నారు. దీనికోసం ఆయన అనేక ఆఫర్లను సైతం ప్రకటించారు.

తనను వివాహం చేసుకునే యువతికి ప్రపంచశ్రేణి విలాసవంతమైన జీవనశైలి కల్పిస్తానని బెంజమిన్ హామీ ఇచ్చారు. 50 గదుల కోటలో రాణిలా బతికే అవకాశం, ప్రతి ఏటా కోట్లాది రూపాయల పాకెట్ మనీ, అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లు, కట్టుదిట్టమైన భద్రతతో కూడిన వాతావరణాన్ని ఆయన ఆఫర్ చేశారు. కేవలం ఆర్థిక భరోసా మాత్రమే కాకుండా, అగ్రశ్రేణి జీవనాన్ని అందిస్తాననడం గమనార్హం.
ఈ అన్వేషణ కోసం ఆయన అనేక మార్గాలను ఆశ్రయించారు. పలు డేటింగ్ యాప్స్‌లో ప్రొఫైల్స్ సృష్టించడమే కాకుండా, ప్రధాన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. అంతేకాదు, టెలివిజన్ షోలలో పాల్గొని తన కోరికను బహిరంగంగా వెల్లడించారు. అయినప్పటికీ, సరైన భాగస్వామిని ఎంచుకోవడంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. కేవలం డబ్బు కోసమే కాకుండా, తనతో కలిసి ఉండి, బంధాన్ని జీవితాంతం నిలబెట్టే నిజమైన తోడు కోసం ఆయన వేచి చూస్తున్నారు.
సర్ బెంజమిన్ స్లేడ్ ఈ విచిత్రమైన అభ్యర్థనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వృద్ధాప్యంలో తోడు కోరుకోవడం సహజమని కొందరు మద్దతు ఇస్తుంటే, కేవలం డబ్బు ప్రభావంతో వివాహాన్ని బేరసారంగా మారుస్తున్నారని మరికొందరు విమర్శిస్తున్నారు. వయసు వ్యత్యాసం, ఆస్తి ప్రలోభాలు ఇలా అనేక కోణాల్లో ఈ విచిత్ర ఘటనపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.












Click it and Unblock the Notifications