మేరీల్యాండ్ బిజినెస్ స్కూల్లో కాల్పులు: ముగ్గురి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని మేరిల్యాండ్‌లో బుదవారం ఉదయం జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. ఈ ఘటనతో పలువురు గాయపడ్డారని అధికారులు ప్రకటించారు.

స్థానిక మేరీల్యాండ్ బిజినెస్ పార్కులో ప్రవేశించిన సాయుధుడు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి జనాలకు ముచ్చెమటలు పట్టించాడు. దుండగుడి కాల్పుల మోతతో అక్కడున్నవారు ప‍్రాణభయంతో పరుగులుతీశారు.
నిందితుడిని రాడీ లాబీబ్ ప్రిన్స్‌గా పోలీసులు గుర్తించారు. 2000 బ్లాక్ జీఎంసీ అకాడియా ఎస్‌యూవీ రిజిస్ట్రేషన్‌తో ఉన్న కారులో నిందితుడు పార్కుకు వచ్చినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కాల్పుల ఘటనతో ఉగ్రవాదులకు సంబంధం లేదని ఎప్‌బిఐ అధికారులు అభిప్రాయపడుతున్నారు.ఈ కాల్పుల ఘటనకు పూర్తి వివరాలు అందాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications