భారీ భూకంపం మిగిల్చిన పెను విషాదం.. 1600 మందికిపైగా మృతి
మయన్మార్‌లో సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని నింపింది. భారీ భూకంపం ధాటికి అతలాకుతలమైన మయన్మార్‌లో మృతుల సంఖ్య 1,644కు పెరిగిందని ఆ దేశ అధికారిక మీడియా తెలిపింది. అంతేగాక, ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం గాయపడిన వారి సంఖ్య 3408కి పెరిగిందని, 139 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని తెలిపింది.
భూకంపానికి గురైన మయన్మార్ రాజధాని మాండలే సహా నేపిటావ్ నగరాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అక్కడి అధికారిక మీడియా పేర్కొంది. మయన్మార్‌లోని పలు విమానాశ్రయాలు చాలా వరకు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాలు సహాయక సామగ్రిని, సిబ్బందిని పంపిస్తున్నప్పటికీ, ఫ్లైట్స్ లాండ్ చేయడానికి అనువుగా విమానాశ్రయాలు లేవని, అందువల్ల తీవ్ర ఆటంకం కలుగుతోందని పేర్కొంది.

ఆపరేషన్ బ్రహ్మ-మయన్మార్‌లో తాత్కాలిక ఆస్పత్రి ఏర్పాటు చేసినట్లు భారత ప్రభుత్వం తెలిపింది. తాత్కాలిక ఆస్పత్రి కోసం 118 మంది సిబ్బంది మయన్మార్ బయల్దేరి వెళ్తారని భారత విదేశాంగశాఖ తెలిపింది. మయన్మార్‌లో భూకంపాల ఘటనలో ఇప్పటివరకు భారతీయులెవరూ మృతి చెందలేదని వెల్లడించింది. భూకంప బాధిత మయన్మార్‌కు సహాయక సామగ్రి చేరవేతకు భారత నౌకాదళం చర్యలు తీసుకుంది. నాలుగు నౌకలను సిద్ధం చేయగా- ఐఎన్‌ఎస్ సావిత్రి, ఐఎన్‌ఎస్ సాత్పురలు ఇప్పటికే బయల్దేరాయని వెల్లడించింది.
మయన్మార్ అధికారులతో మాట్లాడిన ప్రధాని మోడీ
మయన్మార్ సైనిక ప్రభుత్వ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలైంగ్‌తో భారత ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. భూకంప మృతులకు సంతాపం తెలిపారు. 'ఆపరేషన్ బ్రహ్మ' కొనసాగింపులో భాగంగా సహాయక సిబ్బందిని పంపిస్తున్నామని వెల్లడిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియావేదికగా వెల్లడించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications