చైనా మిసైల్స్.. టర్కీ డ్రోన్లు..! పాక్ దుశ్చర్యల వెనుక విదేశీ సాయం ?
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ భారీ నష్టాల్ని చవిచూస్తోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో సైనికుల దగ్గరి నుంచి దేశంలో ఆయుధ రక్షణ వ్యవస్థల ధ్వంసం వరకూ భారత్ చేతిలో అన్నీ ఎదురుదెబ్బలే తగులుతున్నాయి. దీంతో భారత్ పై పూర్తి స్దాయి యుద్ధం పేరెత్తే పరిస్ధితే కనిపించం లేదు. ఇలాంటి సమయంలో పాకిస్తాన్ కు మిత్రదేశాల నుంచి ఆయుధ సాయం లభిస్తున్నట్లు తెలుస్తోంది.
మొన్న పాకిస్తాన్ వైమానిక దళం మొదటిసారిగా చైనా తయారు చేసిన సుదూర ఎయిర్-టు-ఎయిర్ క్షిపణిని భారత్ పై ప్రయోగించింది. పంజాబ్‌లోని హోషియార్‌పూర్‌లో చైనా తయారీ పీఎల్-15 క్షిపణి శిథిలాలను మన బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. అయితే దీని పూర్తి వివరాలపై అధికారులు పరిశోధన చేస్తున్నారు. చైనాకు చెందిన ఈ క్షిపణిని పాకిస్తాన్ వాడటాన్ని బట్టి చూస్తే భారత్ పై యుద్దంలో ఆ దేశానికి డ్రాగన్ కంట్రీ అండ లభిస్తోందన్న అనుమానాలు రేకెత్తిస్తోంది.

అలాగే నిన్న భారత నగరాలపై పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడిలో వారి సైన్యం టర్కిష్ డ్రోన్‌లను ఉపయోగించినట్లు విదేశాంగశాఖ ఇవాళ తెలిపింది. కూలిపోయిన డ్రోన్‌ల నుండి స్వాధీనం చేసుకున్న శిథిలాల ప్రాథమిక ఫోరెన్సిక్ విశ్లేషణ అవి టర్కిష్‌లో తయారు చేసిన అసిస్‌గార్డ్ సోంగర్ నమూనాలుగా గుర్తించారు. వీటిని సాధారణంగా నిఘా, ఖచ్చితమైన దాడుల కోసం ఉపయోగిస్తారని ప్రభుత్వం తెలిపింది.
Pakistan using Turkish drones to attack India, says Defence Ministry
— Sejal Sud (@SejalSud) May 9, 2025
Sad thing is we Indians pay crazy amounts to travel to Turkey 🥲
pic.twitter.com/UueJSmfQ3F
ఇప్పటికే పాకిస్తాన్ జలాల్లో టర్కీ తమ యుద్దనౌకను పంపింది. ఇప్పుడు టర్కీ డ్రోన్ లను పాకిస్తాన్ భారత్ పై ప్రయోగిస్తోంది. అంతకు ముందు చైనా మిసైల్ ను వాడింది. దీంతో భారత్ తో యుద్ధంలో ఓటమి తప్పదని తెలిసే చైనా, టర్కీ వంటి మిత్రదేశాలు ఇలా పాక్ కు ఈ ఆయుధాల్ని అందిస్తున్నాయా అన్న చర్చ జరుగుతోంది. అయితే వీటిని ఎదుర్కోవడంలో భారత బలగాలు ఏమాత్రం తడబాటు లేకుండా దీటుగా స్పందించడంతో పెను ముప్పు తప్పింది.












Click it and Unblock the Notifications