Mecca: మక్కా నగరానికి వైమానిక దాడి అలర్ట్ ..! చరిత్రలో ఇదే తొలిసారి..!

పశ్చిమాసియాలో ఇప్పుడు అమెరికా-ఇరాన్ వార్ ను మించిపోయి సౌదీ అరేబియా-హూతీల వార్ జరుగుతోంది. యెమెన్ లో రెబెల్స్ గా ఉన్న ఇరాన్ మద్దతున్న హూతీలు .. క్రమంలో ఆ దేశంతో పాటు ఎర్ర సముద్రంపై పట్టుపెంచుకుంటూ పోతున్నారు. దీంతో సౌదీ అరేబియా వణుకుతోంది. ఇప్పటికే సౌదీలోని చమురు సరఫరాకు కీలకమైన ఈస్ట్-వెస్ట్ పైప్ లైన్ పై హూతీలు దాడి చేసి ధ్వంసం చేయడంతో రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఇప్పుడు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింల పవిత్ర నగరమైన మక్కాపైనే (Mecca) హూతీలు దాడులు చేసే ప్రమాదం పొంచి ఉండటంతో సౌదీ అరేబియా చరిత్రలో తొలిసారి వైమానిక దాడి అలర్ట్ జారీ చేసింది.

హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!
హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!

యెమెన్‌కు చెందిన హౌతీలు మక్కా పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నారనే సంకేతాల నేపథ్యంలో.. సౌదీ అరేబియా ప్రభుత్వం తమ పశ్చిమ తీరంలోని మక్కా సిటీ, జెడ్డా, తైఫ్ గవర్నరేట్‌లతో సహా పలు ప్రాంతాలను కొద్దిసేపు అలర్ట్ చేసింది. దీంతో ఆ ప్రాంతంలో అప్పటికే చెలరేగుతున్న సంఘర్షణ మరింత తీవ్రమైనట్లయింది. మక్కాలో వైమానిక ముప్పు హెచ్చరిక జారీ చేయడం చరిత్రలో ఇదే మొదటిసారి. మక్కాకు దక్షిణాన ఒక హౌతీ డ్రోన్‌ను సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసిన తర్వాత ఈ వైమానిక దాడి అలర్ట్ జారీ చేశారు.

Mecca Faces First-Ever Air Raid Alert as Saudi Arabia Issues Red Line Warning to Houthis
హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!
హూతీల చేతికి బాబ్ ఎల్-మాండెబ్..! 3వేల కి.మీ దూరంలో భారత్ కు మరో టెన్షన్..!

ఇరాన్ మద్దతు ఉన్న హూతీలకు, సౌదీ మద్దతు ఉన్న యెమెన్ ప్రభుత్వానికి మధ్య చెలరేగిన తాజా పోరాటం రియాద్‌ను కూడా ఈ వివాదంలోకి లాగింది. ఈ క్రమంలో హూతీలు సౌదీ రాజ్యంపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించి, ఎర్ర సముద్రంలో దాని నౌకలను టార్గెట్ చేశారు. మదీనాలోని ప్రిన్స్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ అజీజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లే విమాన రాకపోకలను కూడా ఆపేశారు. యెమెన్ నుండి బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లను ఉపయోగించి సౌదీపై హూతీలు జరిపిన దాడిలో 13 మంది గాయపడిన ఒక రోజు తర్వాత తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. హూతీలతో పోరాడుతున్న సౌదీ నేతృత్వంలోని 57 ముస్లిం దేశాల కూటమి ఈ దాడిని హేయమైనదిగా పేర్కొంటూ ఖండించింది. మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, యాత్రికుల భద్రత ఓ రెడ్ లైన్ అని, భవిష్యత్తులో హూతీల దాడుల్ని అడ్డుకోవడానికి తగిన చర్యలు తీసుకుంటామని ఇస్లామిక్ సహకార సంస్థ తెలిపింది. అయితే మక్కా వైపు తాము డ్రోన్ పంపామని, పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్న సౌదీ వాదనను హూతీలు తోసిపుచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+