వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేపాల్‌లో ఓ బాలుడు విగ్రహంలా మారుతున్నాడు. వివరాల్లోకి వెళితే రమేశ్ దార్జి అనే 11 ఏళ్ల బాలుడి చర్మం క్రమ క్రమంగా ఊడిపోతుంది. దాని స్థానంలో బాగా మందంగా నల్లగా ఉన్న చర్మం వస్తోంది. పుట్టుకతోనే వచ్చిన హార్లీక్వీన్ ఇచ్ఛియోసిస్(పొలుసులుగా ఏర్పడే చర్మవ్యాధి) అనే వ్యాధి వల్ల ఇలా జరుగుతుందని వైద్యులు తెలిపారు.

నేపాల్‌లోని బగ్లంగ్ ప్రాంతంలో నివసించే నార్ కుమారి, నంద దంపతులకు రమేశ్ సంతానం. రమేశ్‌కు పుట్టుకతోనే జన్యుపరమైన లోపం వల్ల చర్మ సంబధిత వ్యాధి వచ్చింది. పుట్టిన పదిహేను రోజుల తర్వాత రమేశ్ శరీరం నల్లగా మారిపోయింది. శిశువు ముఖంపై నల్లని పొలుసులు ఏర్పడ్డాయి. చర్మం గట్టిగా అయిపోయింది.

దీంతో సమీపంలోని ఆసుపత్రిలోని వైద్యులకు రమేశ్‌ను చూపిస్తే, అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అని.. తామేమీ చేయలేమని చెప్పారు. దీంతో రమేశ్ తల్లిదండ్రులు ఖాట్మండ్ మెడికల్ కళాశాల వైద్యులను సంప్రదించారు. ప్రస్తుతం రమేశ్ చర్మంపై ఉన్న నల్లటి పొలుసులు తీసేశారు. ఈ వ్యాధి నుంచి బాలుడు కోలుకోవడానికి రెండు వారాలకొకసారి యాంటీ బయోటిక్స్ ఇస్తున్నారు.

శరీరంపై ఉన్న నల్లటి చర్మాన్ని తొలగించేందుకు మాయిశ్చరైజర్ చేస్తున్నారు. బాలుడు ఎముకలు, కండరాలు బలహీనంగా ఉన్నందుకు ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు. అయితే ఈ వ్యాధి వల్ల రమేశ్ నడవలేకపోతున్నాడు. మాట్లాడటం కూడా చేతకావడం లేదు. పాఠశాలకు కూడా వెళ్లడం లేదు. నాలుగు గోడల మధ్యే కాలం వెల్లదీస్తున్నాడు.

 నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

తన కుమారుడికి వచ్చిన వ్యాధిపై బాలుడి తల్లి నంద ఎంతో ఆవేదన చెందుతున్నారు. తన కుమారుడు ఐదేళ్లు వచ్చే సరికి ఒళ్లంతా నొప్పిగా ఉందని, నడవలేకపోతున్నానని చెప్పినట్లు ఆమె అన్నారు. ఆకలైనప్పుడు, బాత్‌రూమ్‌కు వెళ్లాల్సి వచ్చినపుడు మాత్రమే చెప్పేవాడని తెలిపింది.

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

ఇక మిగిలిన సమయాల్లో చాలావరకు కూర్చుని ఏడుస్తూ ఉండేవాడని.. అది చూసి తమకు బాధగా అనిపించినా, ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోతున్నామని ఆమె పేర్కొన్నారు. పిల్లలు ఎవరైనా అతడిని చూస్తే ఏడుస్తూ పారిపోయేవారని, వాడిని చూడటం కూడా వాళ్లు చాలా ఇబ్బందిగా, కష్టంగా ఉండేదని ఆమె అన్నారు.

 నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

చివరికు కుమారుడి పరిస్థితిని వైద్యపరిభాషలో ఇచ్ఛియోసిస్ అంటారని తెలిసినా, దానికి చికిత్స చేయించలేకపోతున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులలో దానికి చికిత్స ఉందని తెలిసినా, పెద్ద మొత్తంలో డబ్బు అవసరం కావడంతో ఏం చేయాలో ఆ తల్లిదండ్రులకు అర్థం కావడం లేదు.

 నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

కాగా రమేశ్ తండ్రి ఓ కూలీగా పనిచేసుకుంటూ నెలకు 7,000 సంపాదిస్తున్నాడు. అయితే ఈ డబ్బు అతడి మందులకు కూడా సరిపోడవం లేదన్నారు. అయితే అలాంటి సమయంలో బ్రిటిష్ గాయని జాస్ స్టోన్ వారికి అండగా నిలిచారు.

 నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

సంజయ్ శ్రేష్ఠ అనే నేపాలీ గాయకుడు రమేష్‌ను చూసి, అతడి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో.. జాస్ స్టోన్ అతడిని ఆదుకోడానికి ముందుకొచ్చింది. రమేష్ కోసం ఖట్మాండులో ఓ కచేరీ నిర్వహించగా, దాదాపు రూ. 1.33 లక్షలు వచ్చాయి.

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

కచేరీ అయిన మరుసటి రోజునే జాస్ స్టోన్ వారి ఇంటికి రమేష్‌తో రెండు గంటలు గడిపింది. రమేశ్‌ ఆడుకునేందుకు బొమ్మలు, తినేందుకు చాక్లెట్లు తీసుకెళ్లింది. కాగా ప్రస్తుతం రమేశ్‌కు నేపాల్ రాజధాని ఖాట్మండు మెడికల్ కాలేజీలో చికిత్స అందిస్తున్నారు.

 నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

రమేశ్ చర్మం మీద గట్టిగా ఉన్న చర్మాన్ని తీసేయాలని, అది చాలా బాధాకరమైన చికిత్స అని డెర్మటాలజీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సబీనా భట్టారాయ్ తెలిపారు. రెండు వారాల పాటు యాంటీబయాటిక్స్ ఇచ్చి, కొన్ని రకాల మందులు, మాయిశ్చరైజర్ రాసి మృత చర్మాన్ని తీసేశామని వివరించారు.

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

అలా కొన్ని పొరల చర్మం తీసేసిన తర్వాత.. అతడు కాస్త బాగా మాట్లాడగలుగుతున్నాడు. క్రమంగా నడుస్తాడని, తర్వాత మామూలు మనిషిగా కూడా మారుతాడని వైద్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రమేశ్ తల్లి నంద నిత్యం అతడితోనే ఉంటూ బాగోగులు చూస్తుంది.

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

నేపాల్‌లో వింత: రాయిలా మారుతున్న బాలుడు

ఖాట్మండ్ మెడికల్ కాలేజీ వైద్యులు చెప్పిన మాటలకు రమేశ్ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు. బ్రిటిష్ సింగర్ జాస్ స్టోన్ అందించిన ఆర్థిక సాయంతోనే తమ కుమారుడిని మళ్లీ మామూలుగా చూసుకోగలుగుతున్నామని వారు తెలిపారు.

English summary
When Nar Kumari held her little boy for the first time, he couldn't have been more perfect. Smiling back at her, Ramesh looked like any other bouncing baby boy. But just 15 days after she got him home, her son's skin began to peel and was replaced by thick, black scales which have been slowly and painfully entombing him since.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X