జార్జియా సెనెట్ పీఠంపై.. తమిళ తంబీ కన్ను. ఎవరీ అశ్విన్ రామస్వామి?

Ashwin Ramaswami:ప్రపంచమంతా అమెరికా వైపు చూస్తుంది. అగ్రరాజ్య పీఠాన్ని ఎవరు అధిరోహించబోతున్నారనే టెన్షన్ అందరిలోనూ నెలకొంది. ఎవరు గెలిస్తే మనకేంటనే లెక్కలేసుకుంటున్నారు ఆయా దేశాల ప్రజలతో పాటు పాలకులు.. అయితే అమెరికాలోని జార్జియాలో పరిస్థితి మరోలా ఉంది. అక్కడ గెలిచేది ట్రంప్ హా, కమలా హ్యారిస్ అని అక్కడి ప్రజలు చూడటం లేదు. అక్కడంతా ఇప్పుడు ఒకటే నామస్మరణ. దశాబ్దాలపాటు అక్కడి రాజకీయాన్ని చూసిన స్వాన్ స్టీల్ ఒకవైపు ఐతే.. మూతి మీద మీసాలు కూడా సరిగ్గా రాని.. పట్టుమని పాతికేళ్లు కూడా లేని అశ్విన్ రామస్వామి మరోవైపు. అశ్విన్ రామస్వామి పేరు చూస్తే పక్కా ఇండియన్ లా ఉంది కదా.. తెలుగు వ్యక్తేమో అనుకుంటున్నారు కదా.. కాదు కాదు మన పక్క రాష్ట్ర తమిళనాడుకు చెందిన 24ఏళ్ల కుర్రాడు. ప్రస్తుతం ఇండో - అమెరికన్ గా మారిన పక్కా తమిళ తంబి. జార్జీయా సెనేట్ స్థానానికి పోటీ చేస్తున్నాడు. అతడు ఢీ కొంటున్న వ్యక్తి తరతరాలుగా జార్జియాను పాలిస్తున్న, సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న స్వాన్ స్టీల్.

అసలు ఎవరి అశ్విన్ రామస్వామి? అమెరికాలో జరుగుతున్న ఎన్నికల్లో కమలా హ్యారిస్ మద్దతుతో డెమెక్రాట్ సెనెట్ అభ్యర్ధిగా ఎందుకు పోటీ చేస్తున్నాడు. అతడు పోటీ చేయడానికి ప్రేరేపించిన అంశాలేంటో ఇప్పుడు చుద్దాం. అమెరికాలో జరుగనున్న ఎన్నికల్లో మరో 'రామస్వామి' అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. భారత సంతతికి చెందిన అశ్విన్‌ రామస్వామి (24) జార్జియా సెనేట్‌ స్థానానికి పోటీ చేస్తున్నారు. తద్వారా ఆ స్థానానికి పోటీ చేస్తున్న తొలి జనరేషన్‌-జడ్‌ (1997-2012 మధ్య జన్మించినవారు) ఇండో-అమెరికన్‌గా నిలిచారు. అశ్విన్‌ రామస్వామి తల్లిదండ్రులు 1990లో తమిళనాడు నుంచి అమెరికాకు వలస వెళ్లారు. జార్జియా రాష్ర్టానికి సేవ చేయాలన్న ఉద్దేశంతో అధికార డెమోక్రటిక్‌ పార్టీ తరఫున ఆ రాష్ట్రంలోని డిస్ట్రిక్ట్‌ 48 స్టేట్‌ సెనేట్‌ కోసం పోటీ చేస్తున్నట్టు అశ్విన్‌ రామస్వామి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Meet Ashwin Ramaswami The Tamil Nadu-Origin Candidate Running for Georgia Senate

అశ్విన్ రామస్వామి స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్ డిగ్రీ పట్టా పొందారు. జార్జ్‌టౌన్ యూనివర్శిటీ నుంచి లా పట్టా పొందారు. ధార్మిక అధ్యాయనాలతో పాటు.. మైనార్టీ మత కార్యక్రమాల కోసం నిధులు కేటాయించారు. సైబర్‌ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి పనిచేశారు. సైబర్‌ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ కలిసి పనిచేయడంతో పాటు సైబర్ సెక్యూరిటోలోను రామస్వామికి చాలాటాలెంట్ ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ఉపయోగపడే సెక్యూరిటీల తయారీలోనూ కీలక పాత్రపోషించారు. అమెరికాలో మౌలిక వసతుల కల్పన, పెరుగుతున్న తీవ్రవాదం, గన్ కల్చర్, అబార్షన్ వంటి ప్రభావిత అంశాలపై దృష్టి సారించడమే కాకుండా.. అక్కడి ప్రముఖుల మద్దతు పొందారు. దోంతో పాటుగా జార్జీయ ఏదైతో కొల్పోయిందో దాన్ని తిరిగి తీసుకురావడానికి ఎలా కృషి చేస్తారు అనేది కూడా ఆయన అక్కడి ప్రజలకు వివరించారు.

గెలుపు సాధ్యమేనా అనే ప్రశ్న ఉత్పన్నమైతే.. ఆసియా జనాభా 2010లో 16 శాతం నుండి 2022 నాటికి 28 శాతానికి పెరిగింది. సాంప్రదాయ ఓటింగ్ పోకడలు కొనసాగుతున్నప్పటికి.. ఎన్ఆర్ఐలు ఎక్కువగా నివాసం ఉండే జార్జీయాలో ఇప్పటికే వారందరి మద్దతు కూడగట్టుకున్నారు. డెమోక్రాట్లు మరియు మితవాద రిపబ్లికన్‌ల నుంచి కూడా మద్దతు పొందడంతో అశ్విన్ రామస్వామి గెలుపునకు దోహదపడే విషయాలని చెప్పాలి

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+