వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రియురాలితో కలిసి ‘రొమాంటిక్ ట్రిప్’: మెహుల్ చోక్సీని అలా జైలుపాలయ్యారు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కాంలో నిందితుడు మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు పారిపోతుండగా పోలీసులు పట్టుకున్నారని అంటిగ్వా అండ్ బర్బుడా ప్రధాన మంత్రి గ్యాస్టన్ బ్రౌనే వెల్లడించారు. ప్రియురాలితో మెహుల్ చోక్సీ రొమాంటిక్ ట్రిప్‌కు వెళ్లగా డొమినికాలో పట్టుబడ్డారన్నారు. ఈ మేరకు స్థానిక మీడియా కథనాలు ప్రసారం చేసింది.

ఓ చిన్నబోటు ద్వారా డొమినికా చేరుకున్న మెహుల్ చోక్సీ... అక్కడ్నుంచి క్యూబాకు పారిపోతుండగా.. స్థానిక డొమినికా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత అతడ్ని కస్టడీలోకి తీసుకున్నారు. ఇప్పటికే మెహుల్ చోక్సీపై అంతర్జాతీయ లుకౌట్ నోటీసులు జారీ అయిన విషయం తెలిసిందే. ఇక్కడి పోలీసుల అదుపులో ఉన్న మెహుల్ చోక్సీని నేరుగా భారత్‌కు అప్పగించాలని ఆంటిగ్వా ప్రభుత్వం డొమినికా ప్రభుత్వాన్ని కోరింది.

 Mehul Choksis Romantic Trip With Girlfriend to Dominica May Have Landed Him in Jail: Report

కాగా, 2018 నుంచి కరీబియన్ ఐస్లాండ్ నేషన్ ఆంటిగ్వా అండ్ బర్బుడాలో తలదాచుకుంటున్న 62ఏళ్ల మెహుల్ ఛోక్సీ గత కొద్ది రోజు క్రితం అదృశ్యమయ్యారు. ఈ మేరకు అతని తరపు న్యాయవాది విజయ్ అగర్వాల్ వెల్లడించారు. ఛోక్సీ అదృశ్యం నేపథ్యంలో ఆయన కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రముఖ రెస్టారెంట్‌లో విందు కోసం చోక్సీ వెళ్లినట్లు స్థానిక మీడియా పేర్కొంది. చోక్సీ వాహనాన్ని రెస్టారెంట్ సమీపంలోని జాలీ హార్బర్‌లో గుర్తించినట్లు అంటిగ్వా పోలీసులు తెలిపారు.

Recommended Video

#TopNews : Chandrababu ప్లాన్ విఫలం | Pandem Kodi తరహా లో Rapo 19 || Oneindia Telugu

ఈ నేపథ్యంలో మెహుల్ చోక్సీ డొమినికాలో అక్కడి పోలీసులకు పట్టుబడ్డాడు. కాగా, 2017లో మెహుల్ చోక్సీ అంటిగ్వా, బార్బుడా పౌరసత్వం తీసుకున్ానరు. 2018లో పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) కుంభకోణం బయటపడటంతో నీరవ్ మోడీతోపాటు మెహుల్ చోక్సీ దేశం వదిలి పరారయ్యారు. నీరవ్ మోడీకి మెహుల్ చోక్సీ మేనమామ. సుమారు రూ. 14వేల కోట్ల పీఎన్బీ స్కాంలో వీరిద్దరు నిందితులుగా ఉన్నారు. పీఎన్బీ స్కాం కేసులో వీరిని ఇండియా తీసుకువచ్చి విచారించేందుకు సీబీఐతోపాటు ఈడీ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.

English summary
Prime Minister of Antigua and Barbuda Gaston Browne has said that fugitive diamantaire Mehul Choksi might have taken his “girlfriend on a romantic trip" to Dominica and got caught, Antigua News Room reported on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X