వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాకింగ్ స్పీచ్: ట్రంప్‌ తీరును ఖండ ఖండాలుగా ఖండించింది..

' ఒక శక్తివంతమైన వ్యక్తి వేదికలెక్కి ఇలా వికలాంగులను కించపరచడం.. మిగతావారిని కూడా అలా చేయడానికి ప్రోత్సహించినట్టే'-మెరీల్ స్ట్రీప్

|
Google Oneindia TeluguNews

కాలిఫోర్నియా: అధ్యక్ష పదవి చేపట్టడానికి మరికొన్ని రోజుల గడువు మాత్రమే ఉన్న తరుణంలోను డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు ఆగట్లేదు. గతంలో ఆయన ప్రవర్తించిన తీరు ఇప్పటికీ పలువురిని ఆవేదనకు గురిచేస్తూనే ఉంది. తాజాగా ప్రముఖ నటి, మెరీల్‌ స్ట్రీప్‌ ట్రంప్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల కార్యక్రమం వేదికగా ట్రంప్ పై సెసిల్ బి విమర్శలు గుప్పించారు. గతేడాది ఎన్నికల ప్రచారం సందర్బంగా.. ప్రముఖ న్యూయార్క్ టైమ్స్ విలేకరిని ట్రంప్ కించపరిచారనే ఆరోపణలు వచ్చాయి.

Meryl Streep on Donald Trump Disrespect invites disrespect

అదే విషయాన్ని ప్రస్తావిస్తూ.. 'ట్రంప్ నటనను చూసి అవాక్కయ్యాను. ఆయన ప్రవర్తించిన తీరు నా గుండెల్లో గుచ్చుకుంది. ఒక వికలాంగుడిని వెక్కిరిస్తూ.. దేశ అధ్యక్ష పీఠంపై కూర్చోనివ్వాలని ట్రంప్ కోరిన సందర్బమది. ట్రంప్ చేసిందానికి నా గుండె బద్దలైంది. ఆయన చేసిన పని చాలా ప్రభావం చూపిస్తుంది.'

' ఒక శక్తివంతమైన వ్యక్తి వేదికలెక్కి ఇలా వికలాంగులను కించపరచడం.. మిగతావారిని కూడా అలా చేయడానికి ప్రోత్సహించినట్టే. అగౌరవం అగౌరవాన్నే ఆహ్వానిస్తుంది. హింస, హింసనే రెచ్చగొడుతుంది. అలానే శక్తివంతమైనవారు ఇతరులను వేధిస్తే.. అది చాలా నష్టాలకు దారితీస్తుంది. మీడియాకు శక్తి కావాలి.. దాని స్వేచ్చను ఎప్పటికీ కోల్పోకూడదు.' అంటూ సెసిల్‌ బి డిమిల్లీ అవార్డు గ్రహీత మెరీల్‌ స్ట్రీప్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

మెరీల్ స్ట్రీప్ ప్రసంగానంతరం పలువురు నటులు కూడా ట్రంప్ ను విమర్శించడం గమనార్హం. స్ట్రీప్ ప్రసంగంతో గ్లోబెల్ గ్లోబ్ వేడుకల వాతావరణం ఉద్వేగపూరితంగా మార్చింది.

English summary
Meryl Streep won the Cecil B. DeMille Award at the Golden Globes Sunday night in honor of a career full of brilliant performances. And she used her acceptance speech as a chance to shame Donald Trump
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X