ట్రంప్ కాదు, కిమ్ కాదు.. ‘ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌’గా #MeToo ఉద్య‌మ మ‌హిళ‌లు!

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు విషయంలో సస్పెన్స్ వీడిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ నిలిచిన ఈ రేసులో ఆ అవార్డును మూడో వ్యక్తి తన్నుకుపోయాడు.

ఈ ఏడాది ది టైమ్ మ్యాగజైన్ 'ప‌ర్స‌న్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా #MeToo ఉద్య‌మాన్ని ప్రారంభించిన మ‌హిళ‌ల బృందం నిలిచింది. హాలీవుడ్ నిర్మాత హార్వీ వీన్‌స్టెయిన్ చేతిలో వేధింపుల‌కు గురైన మహిళలే ఈ బృందంలో ఉన్నారు.

#MeToo movement named Time magazine’s Person of the Year

వీరంతా #MeToo ట్యాగ్ ద్వారా ఒక్కొక్క‌రుగా త‌మ‌కు జ‌రిగిన అన్యాయాన్ని బ‌య‌ట‌పెట్టారు. వారిని ఆద‌ర్శంగా తీసుకుని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా ఉన్న మ‌హిళ‌లు త‌మ లైంగిక వేధింపుల క‌థ‌లను బ‌య‌టికి చెప్పారు.

ఎంతో మందిని ప్ర‌భావితం చేసిన ఈ ఉద్య‌మాన్ని గుర్తిస్తూ 'ద సైలెన్స్ బ్రేక‌ర్స్‌ (నిశ్శ‌బ్ద ఛేదకులు)' అని ది టైమ్ మ్యాగజైన్ ప్ర‌చురించింది. అలాగే మ్యాగజైన్ ముఖచిత్రం మీద ఈ ఉద్య‌మాన్ని న‌డిపిన‌ ఐదుగురు మ‌హిళ‌ల ఫొటోల‌ను ప్ర‌చురించింది.

ది టైమ్ మ్యాగజైన్ 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు లభించిన #MeToo బృందంలో న‌టి యాష్లీ జుడ్‌, ఉబెర్ మాజీ ఇంజినీర్ సూసెన్ ఫౌల‌ర్‌, అడామా ఇవూ, పాప్ గాయ‌ని టేల‌ర్ స్విఫ్ట్‌, ఇస‌బెల్ పాస్కుల్‌లు ఉన్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
“The Silence Breakers”, the vanguard of a global movement by millions of women to share their stories of sexual harassment and abuse, was revealed on Wednesday to be Time magazine’s Person of the Year. The announcement comes as many industries and power centers around the world are still reeling from an unprecedented reckoning with sexual harassment and abuse that came in the wake of the revelations about film mogul Harvey Weinstein in October. Even as the image of Time’s cover spread across the internet, Weinstein faced a fresh lawsuit on Wednesday from six women and, separately, a group of female US legislators publicly demanded Senator Al Franken resign over accusations that he groped constituents and co-workers.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి