టన్నెల్ ఎఫైర్ ... ప్రేయసి కోసం సొరంగమే తవ్విన ప్రియుడు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మొగుడు
వివాహేతర సంబంధాల వల్ల కలిగే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అక్రమ సంబంధాలు అనేక రకాల ఇబ్బందులకు కారణమవుతాయని అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే మెక్సికోలో చోటు చేసుకున్న ఓ సంఘటన అందరికీ ఆసక్తి కలిగిస్తోంది. వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ ప్రియుడు చేసిన పని నెట్టింట్లో వైరల్ అయ్యేలా చేసింది. ప్రియురాలిని కలవడం కోసం ప్రియుడు ఏకంగా ఒక సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు అంటే ప్రియుడికి ప్రియురాలి పై ఉన్న ఘాటు ప్రేమ ఏ పాటిదో ఇట్టే అర్థమవుతుంది.

వివాహేతర సంబంధం కోసం సొరంగం తవ్విన మెక్సికన్
అసలు విషయానికి వస్తే అల్బెర్టో అనే మెక్సికన్ వ్యక్తి వివాహిత అయిన తన ప్రేయసి ఇంటికి ఒక పొడవైన సొరంగం నిర్మించాడు. భవన నిర్మాణ కార్మికుడు అయిన అతను తన ఇంటికి సమీపంలోనే ఉండే ప్రేయసితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించడానికి ఆ సొరంగ మార్గాన్ని వినియోగిస్తున్నాడు. విలాస్ డెల్ ఫ్రాడో 1 లో ఉన్న ఆల్బర్టో ఇంటి నుండి పక్కనే ఉన్న అతని ప్రియురాలు ఇంటివరకూ నిర్మించిన సొరంగ మార్గం ద్వారా ప్రతిరోజు భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లి వివాహేతర సంబంధాన్ని నెరపుతున్నాడు. ఏకంగా ప్రేయసి బెడ్ రూమ్ కి సొరంగ మార్గాన్ని తవ్వాడంటే అతగాడి తెగువను మెచ్చుకోవాల్సిందే
.

బెడ్ రూమ్ లోకి సొరంగం ద్వారా ఎంట్రీ ఆపై రొమాన్స్ .. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త
ప్రతిరోజు ఆమె భర్త ఉద్యోగానికి వెళ్ళిన సమయంలో, భర్త నైట్ డ్యూటీకి వెళ్ళిన రోజుల్లో అల్బెర్టో ప్రేయసి ఇంట్లోనే మకాం వేసేవాడు .కొన్నేళ్లుగా వారిద్దరూ ఏకాంతంగా ఈ సొరంగం సహాయంతో . కలుసుకునే వారు ఒక రోజు డ్యూటీ నుంచి ఆమె భర్త త్వరగా ఇంటికి రావడంతో, భార్య ప్రవర్తనలో తేడాతో పాటుగా, బెడ్రూంలో అలికిడి కావడంతో గమనించిన భర్త జార్జ్ సదరు ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
జార్జ్ ఒక సోఫా వెనుక దాక్కున్న అల్బెర్టో సొరంగ మార్గం ద్వారా పారిపోయే ప్రయత్నం చేస్తున్న క్రమంలో పట్టుకోవడమే కాకుండా ఆ సొరంగాన్ని చూసి షాక్ అయ్యాడు.

సొరంగం చూసి షాక్ .. వైరల్ అవుతున్న టన్నెల్ ఎఫైర్
మరోపక్క అల్బెర్టో కు కూడా అప్పటికే వివాహం అయ్యింది . తన భార్యకు ఈ విషయం చెప్పవద్దని అల్బెర్టో జార్జ్ ను బ్రతిమాలాడు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న జార్జ్ అతన్ని కొట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏకంగా అల్బెర్టో ఇంటి నుండి తన ఇంటికి సొరంగ మార్గాన్ని చూసిన జార్జ్ కంగుతిన్నారు. అల్బెర్టో పైనా, భార్య పైన కూడా ఫిర్యాదు చేశారు . ప్రస్తుతం కేసు నమోదు చేసిన పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు వివాహేతర సంబంధం కోసం ఏకంగా సొరంగం తవ్వడం తో మెక్సికో లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.