మెక్సికో తీరంలో భారీ భూకంపం! సునామీ వచ్చే ప్రమాదం?
దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది.
మెక్సికో: దక్షిణ మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.1గా నమోదైనట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. మెక్సికో తీరంలోని ట్రెస్‌పికోకు 119 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభించింది.
పిజిజియాపన్‌కు 123 కిలోమీటర్ల దూరంలో 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యంత శక్తిమంతమైన ప్రకంపనలు రావడంతో రాజధాని ప్రాంతంలోని భవనాలు ఒక్కసారిగా కదిలాయి.

దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురై వీధుల్లోకి పరుగులు తీశారు. దాదాపు 90 సెకండ్ల పాటు భవనాలు కంపించాయని స్థానికులు చెబుతున్నారు. భూకంపం కారణంగా సునామీ హెచ్చరికలను జారీచేసినట్లు యూఎస్ వాతావరణ అధికారులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications