సిటీ హాల్‌లో విచక్షణారహిత కాల్పులు: మేయర్ తోపాటు 18 మంది మృతి

మెక్సికన్ సిటీ: మెక్సికోలో మరోసారి కాల్పులు ఘటన కలకలం బీభత్సం సృష్టించింది. బుధవారం శాన్ మిగ్యుల్ టోటోలాపన్ సిటీ హాల్‌లో ఆయుధాలతో వచ్చిన ఓ బృందం జరిపిన కాల్పుల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో నగర మేయర్ కూడా ఉన్నారు.

సాన్ మిగ్యుల్ టోటోలాపాన్ సిటీ హాల్‌లో బుధవారం మధ్యాహ్నం ఈ కాల్పుల ఘటన చోటు చేసుకుంది. దుండగుడు జరిపిన కాల్పుల్లో స్థానిక మేయర్ తోపాటు మరో 17 మంది మరణించారు. ఘటన స్థలంలో 18 మంది మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించింది.

 Mexico: Mass Shooting At San Miguel Totolapan Kills 18, Mayor Among Dead.

మృతుల్లో మేయర్ కాన్రాడో మెన్డోజా, ఆయన తండ్రి, మాజీ మేయర్ జువాన్ మెన్డోజా, ఏడుగురు మునిసిపల్ పోలీసు అధికారులు ఉన్నారు. కాల్పులు జరిపిన అనంతరం నిందితులు పారిపోయేందుకు.. అక్కడి బస్సులు,ఇతర వాహనాలను తగలబెట్టే ప్రయత్నం చేశారు.

కాగా, క్రిమినల్ గ్రూప్ "లాస్ టెక్విలెరోస్" సోషల్ మీడియాలో పంచుకున్న వీడియోలో దాడికి బాధ్యత వహించింది. అయితే ఈ ముఠా దాడిలో పాల్గొన్నదా లేదా అనేది స్థానిక అధికారులు ఇంకా ధృవీకరించలేదు. మరోవైపు ముష్కరులను గుర్తించేందుకు ఆర్మీ, నేవీ విభాగాలను రంగంలోకి దింపుతున్నట్లు జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. కాన్రాడో మెన్డోజాకు చెందిన పీఆర్డీ రాజకీయ పార్టీ ఈ దాడిని ఖండించింది. మేయర్ మరణాన్ని ధృవీకరించింది. మెక్సికోలో ఇటీవల కొంత కాలంగా తుపాకీ హింస పెరిగింది.
సెప్టెంబరు 21న, సెంట్రల్ మెక్సికన్ రాష్ట్రమైన గ్వానాజువాటోలోని ఒక బార్‌లో ముష్కరుల బృందం కాల్పులు జరపడంతో 10 మంది మృతి చెందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+