ఎంహెచ్ 370: 2 విమాన శకలాలు గుర్తించిన ఆస్ట్రేలియా

కౌలాలంపూర్: అదృశ్యమైన మలేషియా విమానం ఎంహెచ్ 370 విషయమై ఆస్ట్రేలియా ప్రధాని టోనీ అబోట్ కొత్త సమాచారం వెల్లడించారు. రెండు విమాన శకలాలు దక్షిణ తీర ప్రాంతంలో గుర్తించినట్లు మలేషియా ప్రధానికి టోనీ అబోట్ ఫోన్ చేసి తెలిపారు. ఆయన గురువారం మాట్లాడుతూ... దక్షిణ తీర ప్రాంతంలో శకలాలు గుర్తించామని, అయితే, వాటిని గుర్తించడం కష్టంగా ఉందని తెలిపారు.

శకలాలు అదృశ్యమైన మలేషియా విమానానివేనా అని గుర్తించాల్సి ఉంది. శకలాలను గుర్తించడానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం నాలుగు హెలికాప్టర్లను సంఘటన స్థలానికి పంపించింది. ఆ శకలాలు మలేషియా విమానానికి చెందినవే అయితే... ప్రమాదానికి గురి అయి ఉంటుందని భావిస్తున్నారు.

 MH 370: Australia bumps into objects, possibly from aircraft

ఆస్ట్రేలియన్ మరిటైమ్ సేఫ్టీ అథారిటీకి (ఎఎంఎస్ఏ) శాటిలైట్ నుండి శకలాలకు సంబంధించిన సమాచారం అందిందని అబోట్ గురువారం చెప్పారు. ఇందుకు సంబంధించి రెండు శకలాలు గుర్తించినట్లు చెప్పారు. కాగా, ఆస్ట్రేలియా ప్రభుత్వం శకలాలను గుర్తించేందుకు హెలికాప్టర్లను పంపినందున ఈ రోజు దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+