No WordPad: మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయం..
వాషింగ్టన్: ప్రఖ్యాత సాఫ్ట్‌వేర్ దిగ్గజ కంపెనీ మైక్రోసాఫ్ట్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై వర్డ్ ప్యాడ్‌ను అప్‌డేట్ చేయకూడదని నిర్ణయించింది. భవిష్యత్తులో విడుదల చేయబోయే విండోస్ సాఫ్ట్‌వేర్‌లో వర్డ్, వర్డ్ ప్యాడ్ ప్రాసెసర్‌ను డిలేట్ చేయనున్నట్లు తెలిపింది. దాదాపు 30 సంవత్సరాల తరువాత విండోస్ నుంచి వర్డ్ ప్రాసెసర్‌ను తొలగించనున్నట్లు పేర్కొంది.
ఇకపై వర్డ్ ప్యాడ్‌ను అప్‌డేట్ చేయదలచుకోలేదని, మున్ముందు విడుదల చేయబోయే విండోస్‌లల్లో ఇది అందుబాటులో ఉండబోదని మైక్రోసాఫ్ట్ యాజమాన్యం స్పష్టం చేసింది. వర్డ్ ప్యాడ్ ఇకపై అప్‌డేట్ చేయట్లేదని, భవిష్యత్తులో విడుదల చేయబోయే విండోస్‌లల్లో ఈ ప్రాసెసర్‌ను తొలగిస్తామంటూ పేర్కొంది.

ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది మైక్రోసాఫ్ట్. మేము .డాక్, .ఆర్టీఎఫ్ వంటి రిచ్ టెక్స్ట్ డాక్యుమెంట్‌ల కోసం మైక్రోసాఫ్ట్, .టీఎక్స్‌టీ వంటి ప్లెయిన్ టెక్స్ట్ డాక్యుమెంట్‌ల కోసం విండోస్ నోట్ ప్యాడ్‌ను రెకమెండ్ చేస్తోన్నామని స్పష్టం చేసింది. మైక్రోసాఫ్ట్ ఆటోసేవ్, ట్యాబ్‌ల ఆటోమేటిక్ రీస్టోరల్ వంటి ఫీచర్‌లతో నోట్ ప్యాడ్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు వెల్లడించింది.
మైక్రోసాఫ్ట్ తన విండోస్ నోట్ ప్యాడ్ యాప్‌ను మొదటిసారిగా 2018లో అప్‌డేట్ చేసింది. అప్పటి నుంచి విండోస్ 11 వర్షన్‌కు దీనికి సంబంధించిన ట్యాబ్‌లను యాడ్ చేస్తూ వచ్చింది. వర్డ్ పాడ్‌కు అదే స్థాయిలో డిమాండ్ లేకపోవడం వల్ల దీన్ని శాశ్వతంగా తొలగించాలని నిర్ణయించింది.

విండోస్ 7, విండోస్ 8 రీడిజైన్ తరువాత వర్డ్ ప్యాడ్‌పై పెద్దగా దృష్టి సారించలేదు మైక్రోసాఫ్ట్ కంపెనీ యాజమాన్యం. వర్డ్ ప్రాసెసర్‌ను అప్‌డేట్ చేయలేదు. ఇక దాన్ని పూర్తిగా తీసివేయాలనే నిర్ణయానికి వచ్చింది. 2024లో విడుదల చేయబోయే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఫీచర్లతో అందుబాటులోకి తీసుకుని రాబోయే విండోస్ 12లో వర్డ్ ప్యాడ్ కనిపించకపోవచ్చు.












Click it and Unblock the Notifications