సత్య నాదెళ్ల అధికారాలకు కత్తెర: మైక్రోసాఫ్ట్ లో ఏం జరుగుతోంది?

మైక్రోసాఫ్ట్ లో భారీగా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటోన్నాయి. సంస్థ పునర్వ్యవస్థీకరణ ముమ్మరం అయింది. ఇందులో భాగంగా జుడ్సన్ అల్తాఫ్ ఇప్పుడు కమర్షియల్ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా అపాయింట్ అయ్యారు. ఇంతకుముందు ఆయన చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ గా పని చేసేవారు. సీఈఓ సత్య నాదెళ్లకు రిపోర్ట్ చేసేవారు. ఆయనకు అదే డివిజన్ ఇండిపెండెంట్ సీఈఓ ప్రమోషన్ లభించింది.

ఈ క్రమంలో సత్య నాదెళ్ల అధికారాల్లో కోత పడింది. ఆయన పరిధిని కుదించుకుపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రేసులో ఆధిపత్యం సాధించాలనే లక్ష్యంతో కమర్షియల్ బిజినెస్ డివిజన్ బాధ్యతల నుంచి ఆయన తప్పుకొన్నట్లు చెబుతున్నారు. ఇక పూర్తిస్థాయిలో టెక్నాలజీ అప్ గ్రేడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విభాగాలపై ఆయన మరింత దృష్టి పెట్టడానికి వీలుగా ఈ మార్పు జరిగినట్లు చెబుతున్నారు.

Microsoft Appoints New CEO for Commercial Business Nadella Shifts Focus to Tech Leadership

జుడ్సన్ అల్తాఫ్ నియామకాన్ని సత్య నాదెళ్ల స్వయంగా వెల్లడించారు. సేల్స్, మార్కెటింగ్ సంబంధిత కార్యకలాపాలన్నీ కూడా మైక్రోసాఫ్ట్ కమర్షియల్ డివిజన్ పరిధిలోకి వస్తాయి. డేటాసెంటర్ నిర్మాణం, సిస్టమ్స్ ఆర్కిటెక్చర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజీనిరింగ్, సైన్స్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి ఆవిష్కరణలపై దృష్టి పెట్టడానికి ఈ పునర్వ్యవస్థీకరణ దోహదపడుతుందని నాదెళ్ల వెల్లడించారు. ఈ మేరకు బుధవారం బ్లాగ్ లో పోస్ట్‌ పెట్టారు.

Microsoft Appoints New CEO for Commercial Business Nadella Shifts Focus to Tech Leadership

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ఈ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను మళ్లిస్తోన్న విషయం తెలిసిందే. మ్యాన్ పవర్ కంటే కూడా AI ని గట్టిగా నమ్ముకుందా సంస్థ. ఈ పరిస్థితుల మధ్య మైక్రోసాఫ్ట్ మరో ప్రధాన నిర్ణయాన్ని తీసుకుంది. ఉద్యోగుల ఆఫీస్ టైమింగ్స్ ను మరింత కఠినతరం చేసింది. 'రిటర్న్ టు ఆఫీస్' (RTO) పాలసీని మరంత టైట్ చేసింది. ఇందులో భాగంగా టఫ్ అటెండెన్స్ పాలసీని అమలు చేయాలని నిర్ణయించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+