చాలెంజ్: సత్య నాదెళ్ల తలపై బకెట్ ఐస్ వాటర్

న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన మైక్రోసాఫ్ట్ సిఇవో సత్య నాదెళ్ల తలపై ఉద్యోగులు బకెట్ ఐస్ వాటర్ కుమ్మరించారు. న్యూరో డిజెనరేటివ్ వ్యాధిపై చైతన్యం పెంచాలనే సవాల్‌ను స్వీకరించిన నాదెళ్ల దానికి సిద్ధపడ్డారు. ఇదే తరహాలో ఐస్ వాటర్ తలలపై కుమ్మరించుకోవాలని సత్య నాదెళ్ల అమెజాన్ సిఇవో జెఫ్ బెజోస్‌కు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్‌కు సవాల్ విసిరారు.

ఆమ్యియోట్రోఫిక్ లేటరల్ స్క్లోరోసిస్ (ఎఎల్ఎస్)పై చైతన్యం పెంచడానికి ఐస్ బకెట్ వాటర్ కుమ్మరించుకోవాలని మాజీ ప్రో ఫుట్‌బాల్ ఆటగాడు స్టీవ్ గ్లీసన్ సవాల్ విసిరారు. ఆ సవాల్‌ను 46 ఏళ్ల సత్య నాదెళ్ల స్వీకరించారు. తన తలపై ఐస్ వాటర్ కుమ్మరించాలని సత్య నాదెళ్ల తన ఉద్యోగులకు కొందరికి సూచించారు.

ఎఎల్ఎస్‌పై చైతన్యం పెంచడానికి స్టీవ్, జట్టు చేసిన కృషి తనను ఉద్వేగానికి గురి చేసిందని సత్య నాదెళ్ల అన్నారు. మెక్రోసాఫ్ట్ వెబ్ సైట్‌లో పోస్టు ఆ విధంగా ఆయన పోస్టు చేశారు. తన వెనక నిలబడి, ఆ తర్వాత తనపై ఐస్ వాటర్ కుమ్మరించినవారి ఫొటోను కూడా ఆయన పోస్టు చేశారు .

Microsoft employees pour ice water on CEO Satya Nadella

చైతన్యం పెంచడానికి మాత్రమే కాకుండా దాన్ని నయం చేయడానికి అవసరమైన పరిశోధనలు చేయడానికి తమకు ఇది మంచి అవకాశమని ఆయన అన్నారు. ఐస్ వాటర్ మీద పడిన తర్వాత "వోహ్.. దట్ ఈజ్ కోల్డ్" అని అన్నారు. ఆ తర్వాత బెజోస్‌కు, పేజ్‌కు సవాల్ విసిరారు.

తమ ఐస్ బకెట్ సవాల్‌ను స్వీకరించాలని బెజోస్, పేజ్‌లను సవాల్ చేయడానికి ఈ సందర్భాన్ని తాను వాడుకుంటున్నానని ఆయన చెప్పారు. తన వ్యక్తిగత అనుభవం ప్రకారం తలను ఐస్ బకెట్ కింద పెట్టడం కన్నా మేఘాల మధ్య పెట్టడం మంచిదని ఆయన వ్యాఖ్యానించారు.

గ్లీసన్ ఎఎల్‌ఎస్‌తో బాధపడుతున్నాడు. దానిపై చైతన్యం పెంచడానికి ఫౌండేషన్ ఏర్పాటు చేశాడు. ఎఎల్ఎస్ లెక్కల ప్రకారం అమెరికాలో ఎఎల్ఎస్‌తో ప్రతి 90 నిమిషాలకు ఒక్కరు మరణిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+