Microsoft News: అమెరికాను హెచ్చరించిన మైక్రోసాఫ్ట్.. ఇరాన్‌పై టెక్ దిగ్గజం సంచలన ఆరోపణలు

US elections: ఓ దేశంలో జరిగే ఎన్నికలు అక్కడి ప్రజల భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో ఎలక్షన్స్ మాత్రం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే అంతర్జాతీయ సమాజం అమెరికా ఎన్నికలకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తాయి. పలు దేశాల ఎన్నికల్లో ఇతరుల జోక్యం పెరుగుతోందని ఇటీవల ఆందోళనలు వ్యక్తం అవుతోంది. ఈ తరహా చర్యలకు బ్రేక్ వేసేలా తాజాగా మైక్రోసాఫ్ట్ కీలక హెచ్చరిక చేసింది.

ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఇరాన్ హ్యాకింగ్ గ్రూప్ మరింత యాక్టివ్‌ అవుతున్నట్లు మైక్రోసాఫ్ట్ బ్లాగ్ పేర్కొంది. US ఎన్నికల సంబంధిత వెబ్‌సైట్‌లు మరియు అమెరికన్ మీడియా అవుట్‌లెట్‌లను చురుకుగా పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఎలక్షన్స్‌ను మానిప్యులేట్ చేసేందుకు సంభావ్య కార్యకలాపాలను ఈ చర్య సూచిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.

Microsoft warns about Iranian hackers over US elections

కాటన్ సాండ్‌స్టార్మ్ గా పిలిచే ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్‌తో సంబంధాలున్న హ్యాకర్లపై మైక్రోసాఫ్ట్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ఎన్నికలకు సంబంధించిన బహుళ వెబ్‌సైట్‌లపై నిఘా పెంచినట్లు వెల్లడించింది. వాటిలో వల్నరటీస్‌ను గుర్తించేందుకు గత మేలో USకు చెందిన ఓ న్యూస్ అవుట్‌లెట్‌ను కూడా స్కాన్ చేసినట్లు పేర్కొంది. ఎన్నికల రోజు దగ్గర పడుతున్న కొద్దీ ఆయా గ్రూప్స్ వాటి కార్యాచరణను పెంచుతున్నారని స్పష్టం చేసింది.

ఐక్యరాజ్యసమితిలో ఇరాన్ మిషన్ ప్రతినిధి మాట్లాడుతూ ఇటువంటి ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమైనవని, పూర్తిగా ఆమోదయోగ్యం కాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. అమెరికా ఎన్నికలలో జోక్యం చేసుకునే ఉద్దేశ్యం ఇరాన్‌కు లేదని వివరించారు. కాగా ఇరానియన్ హ్యాకర్ గ్రూప్ కాటన్ సాండ్‌స్టార్మ్ 2020లోనూ అధ్యక్ష ఎన్నికలకు కొద్దిసేపటి ముందు సైబర్-ఎనేబుల్డ్ ఇన్‌ఫ్లూయన్స్ ఆపరేషన్‌ను ప్రారంభించింది. ఫ్లోరిడా నివాసితులు వేలాది మందికి ట్రంప్‌కు ఓటు వేయండి అంటూ ఇ-మెయిల్స్ పంపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+